మంగళవారం 26 మే 2020
International - Apr 24, 2020 , 07:26:27

అమెరికాలో 24 గంటల్లో 3,176 మంది మృతి

అమెరికాలో 24 గంటల్లో 3,176 మంది మృతి

వాషింగ్టన్‌ : అమెరికాలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. అమెరికాలో గడిచిన 24 గంటల్లో 3,176 మంది కరోనా వైరస్‌తో చనిపోయారు. అక్కడ ఇప్పటి వరకు 8.79 లక్షలకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. నిన్న కొత్తగా 30,713 కేసులు నమోదయ్యాయి. అమెరికాలో ఇప్పటి వరకు కరోనాతో 49,769 మంది ప్రాణాలు కోల్పోయారు. 85 వేల మందికి పైగా బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. 

న్యూయార్క్‌లో 20,861, న్యూజెర్సీలో 5,428, మాసాచుసెట్స్‌లో 2,360, కాలిఫోర్నియాలో 1,523, పెన్సిల్వానియాలో 1,685, మిచిగాన్‌లో 2,977, ఫ్లోరిడాలో 987, లూసియానాలో 1,599 మంది కరోనాతో ప్రాణాలు విడిచారు.

సాధారణ కార్యకలాపాలను ప్రారంభించాలని ప్రజలకు ట్రంప్‌ సర్కార్‌ విజ్ఞప్తి చేసింది. నిరుద్యోగుల ప్రయోజనాల కోసం మరో 44 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. అమెరికాలో ఉద్యోగాలు కోల్పోయిన వారి సంఖ్య 2.6 కోట్లకు పెరిగింది. 


logo