గురువారం 04 జూన్ 2020
International - Apr 28, 2020 , 07:31:52

యూఎస్‌ఏలో గత 24 గంటల్లో 1,303 మంది మృతి

యూఎస్‌ఏలో గత 24 గంటల్లో 1,303 మంది మృతి

హైదరాబాద్‌ : యూఎస్‌ఏలో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో కరోనాతో 1,303 మంది మృతి చెందినట్లు జాన్స్‌ హాఫ్‌కిన్స్‌ యూనివర్సిటీ వెల్లడించింది. ఇప్పటి వరకు అమెరికాలో కరోనాతో 56,797 మంది ప్రాణాలు కోల్పోయారు. 1,38,990 మంది ఈ వైరస్‌ నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. అమెరికా వ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 10,10,356కు చేరింది. 

న్యూయార్క్‌లో 22,623 మంది, న్యూజెర్సీలో 6,044, మాసాచ్చుసెట్స్‌లో 3,003, ఇల్లినాయిస్‌లో 1,983, కాలిఫోర్నియాలో 1,776, పెన్నిసిల్వానియాలో 1,860, మిచిగాన్‌లో 3,407, ఫ్లోరిడాలో 1,088 మంది కరోనాతో చనిపోయారు. 


logo