బుధవారం 03 జూన్ 2020
International - Apr 10, 2020 , 13:56:08

క‌రోనాపై ఉమ్మ‌డిగా పోరాడుదాం: భార‌త్, నేపాల్ ప్ర‌ధానుల అంగీకారం

క‌రోనాపై ఉమ్మ‌డిగా పోరాడుదాం: భార‌త్, నేపాల్ ప్ర‌ధానుల అంగీకారం

న్యూఢిల్లీ: ప్రపంచ దేశాల‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న క‌రోనా మ‌హ‌మ్మారిపై ఉమ్మడిగా పోరాటం చేసేందుకు భారత్, నేపాల్ ప్ర‌ధానుల మ‌ధ్య అంగీకారం కుదిరింది. ఈ మేరకు ప్రధాని నరేంద్రమోదీ, నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి శుక్ర‌వారం టెలీఫోన్‌లో మాట్లాడుకుని అంగీకారం చేసుకున్నారు. ఈ రోజు తాను నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలితో మాట్లాడాన‌ని, క‌రోనావల్ల తలెత్తుతున్న పరిస్థితిపై చర్చలు జరిపామ‌ని, కొవిడ్-19 క‌ట్ట‌డికి సమిష్టిగా పోరాడుదామ‌ని ఈ సంద‌ర్భంగా నిర్ణ‌యించుకున్నామ‌ని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.

ప్రధాని మోదీ ట్వీట్ చేసిన కొద్ది నిమిషాలకే నేపాల్ ప్రధాని ఓలి ట్విటర్లో స్పందించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీతో తాను ఇవాళ ఫోన్‌లో మాట్లాడాన‌ని, కరోనా వైరస్‌పై మరింత నిబద్ధ‌తో పోరాడాలని ఈ సంద‌ర్భంగా పరస్పరం అంగీకరించామ‌ని, ప్రస్తుతం కొనసాగుతున్న లాక్‌డౌన్ వ‌ల్ల‌ ఇరువైపులా చిక్కుకున్న త‌మ‌ పౌరులను క్షేమంగా చూసుకోవాలని నిర్ణయించుకున్నామ‌ని ఆయ‌న‌ పేర్కొన్నారు. భార‌త్‌లో గత నెల 25 నుంచి లాక్‌డౌన్ కొన‌సాగుతుండ‌గా, నేపాల్‌లో అంతకంటే ఒకరోజు ముందు నుంచే లాక్‌డౌన్ అమ‌ల్లోకి వ‌చ్చింది. 

ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo