సోమవారం 28 సెప్టెంబర్ 2020
International - Aug 13, 2020 , 18:18:03

హైబ్రిడ్‌ భరతనాట్యమిది.. వీడియో వైరల్‌

హైబ్రిడ్‌ భరతనాట్యమిది.. వీడియో వైరల్‌

ప్యారిస్‌ : కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అవసరం లేకున్నా చాలా మంది ఎక్కువ సమయం ఇంట్లోనే గడుపుతున్నారు. కొంతమంది తిండి, నిద్రకు ఎక్కువ సమయం కేటాయిస్తుండగా.. మరికొందరేమో తమ ప్రతిభను ప్రదర్శించడానికి దొరికిన ఈ కాస్తా సమయాన్ని వినియోగిస్తున్నారు. ప్యారిస్‌కు చెందిన ఇద్దరు బాలికలు తమ సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకుని కొత్తరకం నాట్యాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చి ప్రశంసలు అందుకుంటున్నారు. ఓర్లీన్ దేడే, ఉషా జే అనే ఇద్దరు ఇంట్లోనే హిప్-హాప్, భరతనాట్యం కలయికతో యునీక్‌ డ్రాన్స్‌ స్టైల్‌ను ప్రవేశపెట్టారు. అంటే, రెండు నృత్యరీతులను మిళితం చేసి కొత్త డ్యాన్స్ తో తయారుచేసిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అయింది.

ఉషా, అర్లెన్ చేసిన ఈ నృత్యరీతికి 'హైబ్రిడ్ భరతనాట్యం' అని పేరు పెట్టారు. జాక్ హార్లో యొక్క వాట్స్ పాపిన్కు క్లాసికల్ స్టెప్పులను మిళితం చేస్తూ హిప్-హాప్ కళా ప్రక్రియలో వీరిద్దరూ ప్రదర్శించారు. ఈ వీడియోను ఉషా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది.

8-9 సంవత్సరాల వయస్సు నుంచి హిప్-హాప్ చేస్తున్నానని, అదే సమయంలో భరతనాట్యంను 20 సంవత్సరాల వయస్సులో నేర్చుకోవడం ప్రారంభించానని, ఈ రెండు నృత్యాల కలయికతో కొత్త రకం డ్యాన్స్‌ సిద్ధం చేయడం కొత్త అనుభూతినిస్తున్నదని ఉష చెప్పారు.

View this post on Instagram

#HybridBharatham I EPISODE 3. Hey @jackharlow, whats poppin ? ???? ➖⁣⁣⁣⁣ I call this #HybridBharatham and this is my way of mixing 2 styles that I love. Hip-Hop will always be my first love, but I have a big affection for Bharatham. I’m not an expert of Bharatham yet, but I will be. ????????⁣⁣⁣ ➖⁣⁣⁣⁣ ???????????????????????????? : @orlane_dede ???? @usha_jey⁣⁣ ???????????????????????????????????????????????? : @usha_jey ⁣⁣⁣⁣ ???????????????????? ???????????? : @kidathegreat ???? @baileysok ???????????????????????????? ???????????????????????? : @saja.sathiya ???? @ithaj_muah ➖⁣⁣⁣⁣ #whatspoppin #jackharlow #hiphop #dance #ilovethisdance #baratham #bharatham #bharathanatyam #barathanatyam #tamil #tamildance #ghettostyle

A post shared by Usha Jey (@usha_jey) on


logo