శనివారం 28 నవంబర్ 2020
International - Oct 20, 2020 , 16:08:40

కోవిడ్ టీకా కోసం 52 కోట్ల సిరంజిలు నిల్వ‌

కోవిడ్ టీకా కోసం 52 కోట్ల సిరంజిలు నిల్వ‌

హైద‌రాబాద్‌: కోవిడ్ టీకాల కోసం యునిసెఫ్ భారీ ఎత్తున సిరంజిలను సేక‌రిస్తున్న‌ది.  2021 నాటికి సుమారు 52 కోట్ల సిరంజిల‌ను యునిసెఫ్ నిల్వ‌ చేయ‌నున్న‌ది.  ఒక‌వేళ కోవిడ్ వ్యాక్సిన్ వ‌స్తే, అప్పుడు ఆ టీకాల‌ను అందించేందుకు ముంద‌స్తుగా సిరంజిల‌ను యునిసెఫ్ సేక‌రిస్తున్న‌ది. వ్యాక్సిన్ స‌ర‌ఫ‌రా కోసం కావాల్సిన ప్రాథ‌మిక ఏర్పాట్ల‌కు గ్రౌండ్‌వ‌ర్క్ కొన‌సాగుతున్న‌ది.  సిరంజిల‌తో పాటు అవ‌స‌ర‌మైన ఇత‌ర ఇక్విప్మెంట్‌ను కూడా నిల్వ చేస్తున్న‌‌ట్లు ఐక్య‌రాజ్య‌స‌మితికి చెందిన యునిసెఫ్ చెప్పింది.  ప్ర‌స్తుతం ప్ర‌పంచ వ్యాప్తంగా ప‌లు ర‌కాల కోవిడ్ వ్యాక్సిన్ల‌కు క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే.  టీకాల‌కు లైసెన్స్ రాగానే వాటిని వాడేందుకు ప్ర‌తిపాద‌న‌లు త‌యారు చేశారు.  ప్ర‌పంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో సిరంజిలు అవ‌స‌రం వ‌స్తుంద‌ని యునిసెఫ్ వెల్ల‌డించింది. త‌మ గోదాముల్లో సుమారు 52 కోట్ల సిరంజిల‌ను స్టాక్ చేసేందుకు యునిసెఫ్ ప్లానేసింది.