మంగళవారం 31 మార్చి 2020
International - Jan 22, 2020 , 21:15:03

సుడాన్‌ సింహాలకు ఊహించని షాక్‌..

సుడాన్‌ సింహాలకు ఊహించని షాక్‌..

ఉత్తర ఆఫ్రికాలోని సూడాన్‌ దేశంలో గల ఖార్జూమ్‌లోని ఆల్‌ ఖురేషీ అనే జంతు ప్రదర్శనశాలలో సింహాలకు ఊహించని షాక్‌ ఎదురవుతోంది. జూలో ఉన్న సింహాలు ఆహారం లేక అలమటిస్తున్నాయి.

సూడాన్‌: ఉత్తర ఆఫ్రికాలోని సూడాన్‌ దేశంలో గల ఖార్జూమ్‌లోని ఆల్‌ ఖురేషీ అనే జంతు ప్రదర్శనశాలలో సింహాలకు ఊహించని షాక్‌ ఎదురవుతోంది. జూలో ఉన్న సింహాలు ఆహారం లేక అలమటిస్తున్నాయి. ఆహారం లభించక సింహాలు బక్కచిక్కిపోతున్నాయి. వివరాల్లోకెళ్తే..  సింహాల దీనగాథను వర్ణించడానికి మాటలు రావడం లేదని జూ నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని వారాలుగా సింహాలు ఆకలితో అలమటిస్తున్నాయని వారు తెలిపారు. గంభీరంగా ఉండాల్సిన మృగరాజులు ఎముకల గూడును తలపిస్తున్నాయనీ.. చాలా సింహాలు సగానికి పైగా బరువు తగ్గాయని జూ నిర్వాహకులు అన్నారు. సింహాలకు ఆహారం అందించేందుకు సొంత డబ్బును ఖర్చు చేస్తున్నట్లు వారు తెలిపారు. 


logo
>>>>>>