బుధవారం 27 మే 2020
International - Apr 24, 2020 , 11:47:39

అమెరికాలో పెరిగిపోతున్న నిరుద్యోగం!

అమెరికాలో పెరిగిపోతున్న నిరుద్యోగం!

న్యూఢిల్లీ: అగ్ర‌రాజ్యం అమెరికాను క‌రోనా మ‌హ‌మ్మారి కోలుకోలేని దెబ్బ కొడుతున్న‌ది. ఇప్ప‌టికే క‌రోనా బారిన‌ప‌డి 50 వేల మందికిపైగా అమెరిక‌న్లు ప్రాణాలు కోల్పోయారు. దాదాపుగా మ‌రో 2 ల‌క్ష‌లు మంది క‌రోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. ఇదిలావుంటే క‌రోనా క‌ట్ట‌డి కోసం విధించిన లాక్‌డౌన్ మ‌రో స‌మ‌స్య‌ను తెచ్చిపెట్టింది. లాక్‌డౌన్ కార‌ణంగా దేశ‌వ్యాప్తంగా ప‌లు సంస్థ‌లు మూత‌ప‌డ‌టంతో ల‌క్ష‌ల మంది నిరుద్యోగులుగా మారుతున్నారు. 

ఇప్పటికే రెండు కోట్ల మందికిపైగా నిరుద్యోగుల జాబితాలో తమ పేర్లు నమోదు చేసుకోగా.. తాజాగా మరో 44 లక్షల మంది నిరుద్యోగ భృతి కోసం ద‌ర‌ఖాస్తు చేశారు. కరోనా విలయం మొదలైన తర్వాత అమెరికాలో సుమారు 2.60 కోట్ల మంది నిరుద్యోగులుగా మారిన‌ట్లు అక్క‌డి అధికార వ‌ర్గాలు తెలుపుతున్నాయి. దీంతో హెచ్‌1బీ వీసాల‌పై తాత్కాలికంగా అమెరికాలో ఉద్యోగం చేస్తున్న భారతీయులు భ‌య‌ప‌డుతున్నారు. కంపెనీలు ఆర్థికంగా కుంగిపోతుండటంతో తమ ఉద్యోగాలు ఉంటాయా? పోతాయా? అని ఆందోళ‌న చెందుతున్నారు. 

ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo