శుక్రవారం 23 అక్టోబర్ 2020
International - Sep 25, 2020 , 17:25:22

కూతురు సూర్యాస్త‌మ‌యం త‌ర్వాత ఇంటికి వ‌చ్చింద‌ని పెళ్లి చేశారు!

కూతురు సూర్యాస్త‌మ‌యం త‌ర్వాత ఇంటికి వ‌చ్చింద‌ని పెళ్లి చేశారు!

వ‌య‌సుతో సంబంధం లేకుండా అమ్మాయిలు ఎవ‌రైనా సూర్యాస్త‌మయం త‌ర్వాత ఇంటికి వెళ్తే ఆ అమ్మాయికి వివాహం చేస్తారు త‌ల్లిదండ్రులు. ఇది వాళ్ల ఆచారం, సంప్ర‌దాయం. చిన్న‌పిల్ల‌లు అయినా బాల్య‌వివాహం చేయ‌డానికి సిద్ద‌మ‌వుతారు. అలా 12 ఏండ్ల నుర్ హెరావతీ అనే అమ్మాయి సూర్యాస్త‌మ‌యం త‌ర్వాత ఇంటికి వెళ్లింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఎక్క‌డికి వెళ్లావు అని త‌ల్లిదండ్రులు నిల‌దీశారు. దీంతో అమ్మాయి అస‌లు నిజం చెప్పింది. సుహైమీ అనే 15 ఏళ్ల పిల్లాడి ఇంటికి వెళ్లి వ‌స్తున్నా అని చెప్పింది.

దీంతో త‌ల్లిదండ్రులు చిన్న‌పిల్ల‌లు అని కూడా చూడ‌కుండా వీరిద్ద‌రికీ బాల్య వివాహం జ‌రిపించారు. ఈ సంప్ర‌దాయం మ‌రెక్క‌డో కాదు. ఇండోనేషియాలో. ఈ సంప్ర‌దాయంపై ప్రభుత్వం ఆంక్ష‌లు విధించిన‌ప్ప‌టికీ పెద్ద‌లు ప‌ట్టించుకోవ‌డం లేదు. దీనికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుండే స‌రికి దీని గురించి పెద్ద మొత్తంలో చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. ఇండోనేషియా రెలిజియస్ అఫైర్స్ ఆఫీస్ (కేయూఏ) ఈ పెళ్లిని అధికారికంగా ఆమోదించలేదు. ఈ ఘటనపై గ్రామ పెద్ద ఎహసాన్ కూడా నిరాక‌రించారు.  logo