ఆదివారం 25 అక్టోబర్ 2020
International - Oct 02, 2020 , 17:51:15

న‌న్ను ఎవ‌రైనా కొనుక్కోండి! ఓ మ‌గాడి ఆవేద‌న‌

న‌న్ను ఎవ‌రైనా కొనుక్కోండి! ఓ మ‌గాడి ఆవేద‌న‌

యుక్త వ‌య‌సు రాగానే పెళ్లి చేసుకుని, సంసార జీవితాన్ని హాయిగా ఎంజాయ్ చేయాల‌ని ప్ర‌తి మ‌గాడు క‌ల‌లు కంటాడు. అంద‌మైన రాకుమారి కోసం వెతుకుతూ.. త‌న మ‌న‌సుకు న‌చ్చిన అమ్మాయికి మ‌న‌సిచ్చి మ‌నువాడుతారు. కొన్ని సంద‌ర్భాల్లో అంద‌మైన మ‌గువ‌ల కోసం పోరాటం చేసిన అబ్బాయిల‌ను చూశాం. అలానే ఓ యువ‌కుడు కూడా త‌న‌కో అమ్మాయి కావాల‌ని డేటింగ్ యాప్స్‌తో పాటు ఇత‌ర వెబ్‌సైట్ల‌లో త‌న వివ‌రాల‌ను ఉంచాడు. కానీ ఏ అమ్మాయి నుంచి కూడా అత‌నికి రెస్పాన్స్ రాలేదు. రోజులు, నెల‌లు గ‌డుస్తున్నాయి.. కానీ అమ్మాయిలు మాత్రం స్పందించ‌డం లేదు. ఒక్క‌మ్మాయి కూడా రెస్పాన్స్ ఇవ్వ‌క‌పోవ‌డంతో ఆ మగాడు ఆవేద‌న‌తో కుమిలిపోతున్నాడు. 

ఈ క్ర‌మంలో ఆ యువ‌కుడు వినూత్నంగా ఆలోచించి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించాడు. త‌న‌ను ఎవ‌రైనా కొనుక్కోండి అంటూ ఫేస్‌బుక్‌లో త‌న ప్రొఫైల్‌ను పోస్టు చేశాడు. తాను ఒంట‌రి వ్య‌క్తిని, ఆరోగ్యంగా ఉన్నాన‌ని వివ‌ర‌ణ ఇచ్చుకున్నాడు. 

నా పేరు అలాన్ క్లాయిట‌న్, 30 సంవ‌త్స‌రాల వ‌య‌సు. ఒక అంద‌మైన అమ్మాయితో మాట్లాడాల‌ని కోరుకుంటున్నాను. అంత‌క‌న్నా ఎక్కువ కూడా! కొన్ని పెళ్లి సంబంధాలు కూడా వ‌చ్చాయి.. కానీ నేను ఒంట‌రిగా ఉండాల‌నుకుంటున్నాను. డేటింగ్ యాప్స్‌ల‌లో అమ్మాయిల కోసం ఎదురుచూశాను కానీ నాకు అదృష్టం వ‌రించ‌లేదు. కాబ‌ట్టి ఫేస్‌బుక్ వేదిక‌గా నా ఆవేద‌న తెలియ‌జేస్తున్నాను అంటూ కొన్ని ఫోటోలు షేర్ చేశాడు. అలాన్ పోస్టింగ్‌కు విశేష‌మైన స్పంద‌న వ‌చ్చింది. మిగ‌తా సోష‌ల్ మీడియా సైట్ల‌లో ఈ పోస్టు విప‌రీతంగా వైర‌ల్ అయింది. 

అయితే అలాన్‌కు స్కూల్ నుంచి కూడా పెద్ద‌గా ఎవ‌రితో సంబంధాలు లేవు. చిన్న‌ప్ప‌టి ఫ్రెండ్స్ అంద‌రికీ పెళ్లిళ్లు అయిపోయి పిల్ల‌ల‌తో ఉన్నారు. ఇప్పుడు తాను ఒంట‌రిగా ఉండ‌టం ఇష్టం లేక తోడు కోసం వెతుకుతున్నాడు. అలాన్ వృత్తిరీత్యా లారీ డ్రైవ‌ర్. కాబ‌ట్టి అలాన్‌తో డేటింగ్ చేసేందుకు ఎవ‌రూ ఇష్ట‌ప‌డటం లేదని అత‌ని న‌మ్మ‌కం. త్వ‌ర‌లోనే త‌న‌కు ఓ మంచి అమ్మాయి దొరుకుతుంద‌నే న‌మ్మ‌కంతో అలాన్ ఉన్నాడు. ఈ మోస్ట్ ఎలిజ‌బుల్ బ్యాచిల‌ర్‌కు ఎవ‌రైనా ప్ర‌పోజ్ చేస్తారా? లేదా చూడాలి. 


logo