బుధవారం 01 ఏప్రిల్ 2020
International - Jan 23, 2020 , 11:22:40

బెజోస్ ఫోన్ హ్యాక్‌.. ప్రిన్స్ స‌ల్మాన్‌ను విచారించాలి: ఐక్య‌రాజ్య‌స‌మితి

బెజోస్ ఫోన్ హ్యాక్‌.. ప్రిన్స్ స‌ల్మాన్‌ను విచారించాలి: ఐక్య‌రాజ్య‌స‌మితి

హైద‌రాబాద్‌:  అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ ఫోన్‌ను సౌదీ అరేబియా ప్రిన్స్ బిన్ స‌ల్మాన్ హ్యాక్ చేసిన‌ట్లు ఆరోప‌ణ‌లు వ‌స్తున్న విష‌యం తెలిసిందే. అయితే ఈ ఘ‌ట‌న‌పై త‌క్ష‌ణ విచార‌ణ చేప‌ట్టాల‌ని ఐక్య‌రాజ్య‌స‌మితి మాన‌వ హ‌క్కుల నిపుణులు డిమాండ్ చేశారు.  ప్ర‌త్య‌ర్థుల‌ను నిరంత‌రంగా టార్గెట్ చేస్తున్న ప్రిన్స్ స‌ల్మాన్‌ను విచారించాల‌ని యూఎన్ నిపుణులు పేర్కొన్నారు.  బెజోస్‌కు ఓ మెసేజ్ పంపిన స‌ల్మాన్‌.. ఆ మెసేజ్‌తో స్పైర్‌వేర్‌ను ప్ర‌యోగించార‌ని, దాని ద్వారా అమెజాన్‌ అధినేత డేటాను చోరీ చేశార‌ని ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి.  అయితే ఈ క‌థ‌నంలో వాస్త‌వం లేద‌ని దుబాయ్‌లో ఉన్న యూఎస్ ఎంబ‌సీ పేర్కొన్న‌ది. కానీ యూఎన్ నిపుణులు మాత్రం బెజోస్ ఫోన్‌ను హ్యాక్ చేసిన అంశంలో ప్రిన్స్ స‌ల్మాన్‌ను విచారించాల‌ని డిమాండ్ చేశారు. వాషింగ్ట‌న్ పోస్టు ప‌త్రిక‌లో ప‌నిచేస్తున్న జ‌ర్న‌లిస్టు జ‌మాల్ ఖ‌షోగ్గి హ‌త్య కేసులో త‌మ ప్ర‌మేయం ఏమీలేద‌ని ప్రిన్స్ స‌ల్మాన్‌.. ఇటీవ‌ల బెజోస్‌కు ఓ మెసేజ్ చేశారు.  సౌదీ మీకు వ్య‌తిరేకంగా లేద‌న్న సందేశంతో ప్రిన్స్ స‌ల్మాన్ ఆ మెసేజ్ చేశారు. కానీ ఆ మెసేజ్‌తో పాటు స్పైవేర్ కూడా బెజోస్ ఫోన్‌లో ఇన్‌స్టాల్ అయ్యింద‌న్న ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. వాషింగ్ట‌న్ పోస్టు ఓన‌ర్ బెజోస్ కావ‌డంతో అత‌న్ని ప్రిన్స్ స‌ల్మాన్ హ్యాక్ చేసి ఉంటార‌ని భావిస్తున్నారు. 

  


logo
>>>>>>