శనివారం 19 సెప్టెంబర్ 2020
International - Jul 17, 2020 , 06:40:16

ప్ర‌పంచ ఉగ్ర‌వాదిగా నూర్ వ‌లి మెహ‌సూద్‌

ప్ర‌పంచ ఉగ్ర‌వాదిగా నూర్ వ‌లి మెహ‌సూద్‌

న్యూయార్క్‌: పాకిస్థాన్ కేంద్రంగా ప‌నిచేస్తున్న ఉగ్ర‌వాద సంస్థ తెహ్రిక్‌-ఇ-తాలిబాన్ పాకిస్థాన్‌ (టీటీపీ) నాయకుడు నూర్ వ‌లి మెహసూద్‌ను ఐక్యరాజ్యసమితి ప్ర‌పంచ ఉగ్ర‌వాదిగా ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు ప్ర‌వేశ‌పెట్టిన తీర్మానాన్ని భద్రతా మండలి కమిటీ ఆమోదించింది. దీంతో మెహసూద్ ఆస్తుల‌ను స్తంభింపజేయడంతో పాటు ప్రయాణ, ఆయుధాలు ఉప‌యోగించ‌డం వంటి అంశాల్లో ఆంక్షలు విధించింది. 

టీటీపీని పాకిస్థాన్ తాలిబాన్ అని కూడా పిలుస్తారు. ఈ సంస్థ బ‌హుళ ఆత్మాహుతి దాడుల‌కు పాల్ప‌డుతుంది. ఈ సంస్థ‌ను గ‌తంలో డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్పెష‌ల్ డిసిగ్నేటెడ్ గ్లోబ‌ల్ టెర్ర‌రిస్ట్‌గా పేర్కొనేవారు. టీటీపీ మాజీ నాయ‌కుడు ముల్లా ఫ‌జుల్లా చ‌నిపోవ‌డంతో ముఫ్తీ నూర్ వ‌లి మెహ‌సూద్ అధ్య‌క్షుడిగా 2018లో ఎంపిక‌య్యాడు. అత‌ని నాయ‌క‌త్వంలో పాకిస్థాన్‌లో అనేక ఉగ్ర‌దాడుల‌కు టీటీపీ బాధ్య‌త వ‌హించింది. 


గ‌తేడాది జైషే మ‌హ‌మ్మ‌ద్ చీఫ్ మ‌సూద్ అజార్‌ను ప్ర‌పంచ ఉగ్ర‌వాదిగా ఐరాస ప్ర‌క‌టించింది. 


logo