శనివారం 30 మే 2020
International - May 01, 2020 , 13:40:18

కోవిడ్‌పై పోరులో కొరియానే ఆద‌ర్శంః యూఎన్‌

కోవిడ్‌పై పోరులో కొరియానే ఆద‌ర్శంః యూఎన్‌

కోవిడ్‌-19 వైర‌స్‌పై పోరులు ప్ర‌పంచ‌దేశాలు ద‌క్షిణ కొరియాను ఆద‌ర్శంగా తీసుకోవాల‌ని ఐక్య‌రాజ్య‌స‌మితి కార్య‌ద‌ర్శి ఆంటోనియో గుటెర్రెస్ పిలుపునిచ్చారు. కోవిడ్ వైర‌స్‌ను ద‌క్షిణ కొరియా విజ‌య‌వంతంగా నియంత్రించింది. గ‌త రెండుమూడు వారాలుగా ఒక్క కొత్త‌కేసు కూడా నమోదు కాలేదు. క‌రోనా సంక్షోభం నుంచి దేశాన్ని ఆర్థికంగా బ‌య‌ట‌ప‌డేసేందుకు గొప్ప హ‌రిత ల‌క్ష్యాన్ని చేప‌ట్టింద‌ని గుటెర్రెస్ తెలిపారు. ఇందులో భాగంగా ద‌క్షిణ కొరియాలో బొగ్గు ఆధారిత ప‌రిశ్ర‌మ‌ల‌న్నీ మూసేయాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఈ దేశంలో 10,765 క‌రోనా కేసులు న‌మోదు కాగా 247 మంది మ‌ర‌ణించారు. గురువారం నాలుగు క‌రోనా కేసులు న‌మోదైన‌ప్ప‌టికీ వారిలో కొరియావాసులు ఎవ‌రూ లేర‌ని ఆ దేశ వ్యాధి నియంత్ర‌ణ సంస్థ ప్ర‌క‌టించింది. 


logo