ఆదివారం 31 మే 2020
International - Apr 18, 2020 , 11:32:31

ఇండియాకు సెల్యూట్ చేస్తున్నా : యూఎన్ చీఫ్‌

ఇండియాకు సెల్యూట్ చేస్తున్నా :  యూఎన్ చీఫ్‌

హైద‌రాబాద్‌:  కోవిడ్‌19 నియంత్ర‌ణ‌కు భార‌త్ చేస్తున్న పోరాటాన్ని, స‌హాయాన్ని ఐక్యరాజ్య‌స‌మితి ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి గుటెర్ర‌స్ మెచ్చుకున్నారు.  హైడ్రాక్సీక్లోరోక్విన్ లాంటి యాంటీ మ‌లేరియా మందుల‌ను అవ‌స‌ర‌మైన దేశాల‌కు పంపిణీ చేసి భార‌త్ త‌న వంతు క‌ర్త‌వ్యాన్ని నిర్వ‌హించిద‌ని గుట‌ర్రెస్ తెలిపారు. ఈ నేప‌థ్యంలో భార‌త్‌కు సెల్యూట్ చేస్తున్న‌ట్లు గుటెర్ర‌స్ ప్ర‌తినిధి చెప్పారు. అమెరికాకు చెందిన యూఎస్ ఫుడ్ అండ్ డ్ర‌గ్ అడ్మినిస్ట్రేష‌న్‌.. కోవిడ్‌19 చికిత్స‌కు హైడ్రాక్సీక్లోరోక్విన్ మందు అని గుర్తించింది.ఆ డ్ర‌గ్‌ను సుమారు 1500 మంది పేషెంట్ల‌పై న్యూయార్క్‌లో ప్ర‌యోగించారు. ఈ నేప‌థ్యంలో గుటెర్ర‌స్ ప్ర‌పంచ‌దేశాల సంఘీభావాన్ని కోరారు.  ఒక దేశం మ‌రో దేశానికి వీలైనంత సాయం చేయాల‌న్నారు. అలా చేస్తున్న దేశాల‌కు తాను సెల్యూట్ చేస్తున్న‌ట్లు చెప్పారు. ఈ విష‌యాన్ని యూఎన్ చీఫ్ ప్ర‌తినిధి స్టీఫెన్ డుజారిక్ తెలిపారు. 

ఆఫ్గ‌నిస్తాన్, భూటాన్; బ‌ంగ్లాదేశ్‌, నేపాల్‌, మాల్దీవులు, మారిష‌స్‌, శ్రీలంక‌, మ‌య‌న్మార్‌, జాంబియా, డామినిక‌న్ రిప‌బ్లిక్‌, మ‌డ‌గాస్క‌ర్‌;  ఉగాండా, బుర్కినా ఫాసో, నైజ‌ర్‌, మాలి, కాంగో, ఈజిప్ట్‌, ఆర్మేనియా, క‌జ‌కిస్తాన్‌, ఈక్వెడార్‌, జ‌మైకా, సిరియా, ఉక్రెయిన్‌, చాద్‌, జింబాబ్వే, ఫ్రాన్స్‌, జోర్డాన్, కెన్యా, నెద‌ర్లాండ్స్‌, నైజీరియా, ఒమ‌న్, పెరు లాంటి దేశాల‌కు భార‌త్ హైడ్రాక్సీ మందును స‌ర‌ఫ‌రా చేస్తున్న‌ది.  డోనాల్డ్ ట్రంప్ అభ్య‌ర్థ‌న మేర‌కు అమెరికాకు కూడా ఈ డ్ర‌గ్ స‌ర‌ఫ‌రా అవుతున్న‌ది.


logo