మంగళవారం 14 జూలై 2020
International - Jun 24, 2020 , 09:24:14

కోవిడ్‌19 నియంత్ర‌ణ‌లో స‌హ‌కారం లోపించింది : ఐక్య‌రాజ్య‌స‌మితి

కోవిడ్‌19 నియంత్ర‌ణ‌లో స‌హ‌కారం లోపించింది : ఐక్య‌రాజ్య‌స‌మితి

హైద‌రాబాద్‌: కోవిడ్‌19 నివార‌ణ‌లో ప్ర‌పంచ దేశాల మ‌ధ్య స‌హ‌కారం కొర‌వ‌డిన‌ట్లు ఐక్య‌రాజ్య‌స‌మితి ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఆంటోనియో గుటెర‌స్ తెలిపారు. ఒంట‌రిగా పోరాటం చేయాల‌న్న విధానంతో వైర‌స్‌ను ఓడించ‌లేమ‌న్నారు.  ఓ మీడియా సంస్థ‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆయ‌న ఈ విష‌యాన్ని వెల్లడించారు. ఒంట‌రి పోరాటం వ‌ల్ల వైర‌స్‌ను నియంత్రించ‌లేమ‌న్న విష‌యాన్ని ఆయా దేశాలు అర్థం చేసుకోవాల‌ని, వైర‌స్ నియంత్ర‌ణ‌లో ప్ర‌పంచ దేశాల స‌హ‌కారం అవ‌స‌ర‌మ‌న్నారు. చైనాలో మొద‌లైన కోవిడ్ ఆ త‌ర్వాత యూరోప్‌, అమెరికా, ద‌క్షిణ అమెరికా, ఆఫ్రికా, భార‌త్‌లోనూ విజృంభించింద‌న్నారు.

ఇప్పుడు రెండ‌వ ద‌శ మొద‌లుకానున్న‌ట్లు కొంద‌రు మాట్లాడుతున్నార‌ని ఆయ‌న అన్నారు.  కోవిడ్‌ను ఎదుర్కోవ‌డంలో స‌హ‌కారం లోపించిన‌ట్లు ఆయ‌న చెప్పారు. అన్ని దేశాల‌ను ఒక వేదిక‌పైకి తీసుకురావాల‌ని, ఆయా దేశాలు త‌మ సామ‌ర్థ్యాల‌ను ముందు పెట్టాల‌ని.. చికిత్స‌, టెస్టింగ్ ప్ర‌క్రియ‌, వ్యాక్సిన్ అందుబాటు గురించి ప్ర‌తి ఒక్క‌రికీ తెలియ‌జేయాల‌న్నారు. అలా అయితేనే మ‌హ‌మ్మారి క‌రోనాను ఎదుర్కొన‌గ‌ల‌మ‌న్నారు.  logo