బుధవారం 23 సెప్టెంబర్ 2020
International - Aug 04, 2020 , 14:32:49

యూకేలో 3 లక్షలు దాటిన కరోనా కేసులు

యూకేలో 3 లక్షలు దాటిన కరోనా కేసులు

లండన్‌ : యూకేలో కరోనా మహమ్మారి రోజురోజుకూ విజృంభిస్తోంది. నిత్యం సుమారు వెయ్యికిపైగా పాజిటివ్‌ కేసులు నమోదవుతుండగా మరణాల సంఖ్యా పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో ఆ దేశంలో కొత్తగా 930కి పైగా కరోనా కేసులు నమోదు కాగా 9 మంది మృతి చెందారు. యూకేలో ఇప్పటివరకు 3,05,600 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని ఆ దేశ ఆరోగ్య  సామాజిక రక్షణశాఖ తన నివేదికలో వెల్లడించింది.

సోమవారం మధ్యాహ్నం వరకు ఆ దేశంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 46,210 వరకు చేరింది. గడిచిన రెండు రోజుల్లో యూకేలో 1,515 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కరోనా మరణాల్లో యునైటెడ్ కింగ్‌డమ్‌ను ఇప్పటికే మెక్సికో అధిగమించింది. కరోనా వేగంగా వ్యాప్తి చెందుతున్న దేశాల్లో యునైటెడ్ స్టేట్స్ (అమెరికా), బ్రెజిల్ తరువాత మూడో అతిపెద్ద దేశంగా మెక్సికో అవతరించగా యూకే నాలుగో స్థానంలో కొనసాగుతోంది.


logo