బుధవారం 03 జూన్ 2020
International - Mar 30, 2020 , 02:29:41

పరిస్థితులు దిగజారొచ్చు

పరిస్థితులు దిగజారొచ్చు

-ప్రజలకు బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ హెచ్చరిక

లండన్‌: విశ్వమారి కరోనాతో బ్రిటన్‌ అల్లాడుతున్నది. దేశంలో కొవిడ్‌ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఈక్రమంలో కరోనా వల్ల రానున్న కాలంలో పరిస్థితులు మరింతగా దిగజారనున్నాయని ఆ దేశ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ ప్రజల్ని హెచ్చరించారు. ప్రజలెవ్వరూ ఇండ్ల నుంచి బయటకు రావొద్దని, ప్రభుత్వ ఆదేశాల్ని పాటిస్తూ తమ ప్రాణాల్ని కాపాడుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈమేరకు ఆయన దేశ ప్రజలకు లేఖల్ని రాశారు. పరిస్థితులు అనుకూలించక ముందే, పరిస్థితులు రాను రాను మరింత దిగజారి పోతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అయినప్పటికీ, ప్రభుత్వం కావాల్సిన జాగ్రత్తలు తీసుకుంటున్నదని పేర్కొన్నారు. ప్రభుత్వాధికారుల సలహాలు, సూచనల్ని ప్రజలు పాటించాలని కోరిన ఆయన.. త్వరలోనే దేశంలో తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొంటాయని ఆకాంక్షించారు. తమ ప్రాణాల్ని లెక్కచేయకుండా రోగులకు సేవలందిస్తున్న వైద్యుల్ని ప్రశంసించారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రజలు బయటకు వచ్చి ప్రమాదంలో పడవద్దని, ప్రాణాల్ని కాపాడుకోవాలని సూచించారు. కరోనా పాజిటివ్‌ రావడంతో స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయిన ప్రధాని బోరిస్‌.. వీడియో కాన్ఫరెన్సుల ద్వారా అధికారులతో పరిస్థితుల్ని సమీక్షిస్తున్నారు. కాగా బ్రిటన్‌లో శనివారంనాటికి 17వేలకు పైగా కరోనా కేసులు నమోదవ్వగా, వెయ్యి మందికి పైగా చనిపోయారు.logo