శనివారం 28 నవంబర్ 2020
International - Nov 09, 2020 , 21:49:30

ఉక్రేనియన్ అధ్యక్షుడికి కరోనా

ఉక్రేనియన్ అధ్యక్షుడికి కరోనా

కైవ్: ఉక్రేనియన్‌ అధ్యక్షుడు వోలోడైమిర్ జెలెన్‌స్కీకి కరోనా సోకింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే సోమవారం వెల్లడించారు. క్వారంటైన్‌ పద్ధతులు పాటించినప్పటికీ కరోనా వైరస్‌ బారినపడినట్లు ట్వీట్‌ చేశారు.  ‘కరోనా ముప్పు లేని అదృష్టవంతులైన వ్యక్తులెవరూ లేరు. క్వారంటైన్‌ జాగ్రత్తలు తీసుకున్నప్పటికా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం నేను బాగానే ఉన్నాను. విటమిన్‌ మాత్రలు ఎక్కువగా తీసుకుంటున్నాను. ఐసొలేషన్‌లో ఉంటానని ప్రామిస్‌ చేస్తున్నా. అయినప్పటికీ అధికార విధులు నిర్వహిస్తా. చాలా మంది లాగే నేను కూడా కరోనాను అదిగమిస్తా. అంతా మంచే జరుగుతుంది’ అని అందులో పేర్కొన్నారు. 

మరోవైపు ఉక్రేనియన్‌లో ఇప్పటి వరకు 4.69 లక్షలకుపైగా కరోనా కేసులు వెలుగుచూడగా 8,500 మందికిపైగా మరణించారు. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.