ఆదివారం 20 సెప్టెంబర్ 2020
International - Jul 26, 2020 , 14:53:13

కరోనాతో జాతీయ ఫుట్‌బాల్‌ టీమ్‌ డాక్టర్‌ మృతి

కరోనాతో జాతీయ  ఫుట్‌బాల్‌ టీమ్‌ డాక్టర్‌ మృతి

న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది.  తాజాగా ఉక్రెయిన్‌    జాతీయ ఫుట్‌బాల్‌ జట్టు వైద్యుడు ఆంటోన్‌ హుదేవ్‌(48)  కరోనా వైరస్‌తో  మరణించాడని దేశీయ ఫుట్‌బాల్‌  అసోసియేషన్‌(యూఏఎఫ్‌) తెలిపింది. 

ఉక్రెయిన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఫుట్‌బాల్‌ అధ్యక్షుడు ఆండ్రీ పావెల్కా,  జాతీయ జట్టు హెడ్‌కోచ్‌ ఆండ్రీ షెవ్‌చెంకో, మొత్తం ఉక్రెయిన్‌ ఫుట్‌బాల్‌  క్రీడాకారుల  తరఫున అతని  కుటుంబానికి మా ప్రగాడ సానుభూతి తెలియజేస్తున్నామని యూఏఎఫ్‌ ఒక ప్రకటనలో తెలిపింది.  ఆంటోన్‌  మృతిపై  జాతీయ జట్టు తీవ్ర విచారం వ్యక్తం చేసింది.   లోకల్‌ క్లబ్‌ మెటాలిస్ట్‌ ఖార్కివ్‌కు కూడా హుదేవ్‌ టీమ్‌ డాక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.  ఉక్రెయిన్‌లో ఇప్పటి వరకు కరోన బారినపడి 1,600 మంది చనిపోయారు.  ఆ దేశంలో కరోనా కేసుల సంఖ్య 65,000కు  చేరింది.    


logo