ఆదివారం 24 జనవరి 2021
International - Dec 13, 2020 , 17:27:12

రోడ్డుపై మంచు.. నడిచేందుకు మహిళ తిప్పలు..! వీడియో వైరల్‌

రోడ్డుపై మంచు.. నడిచేందుకు మహిళ తిప్పలు..! వీడియో వైరల్‌

ఉక్రెయిన్‌: ఉక్రెయిన్‌ వీధుల్లో హిమపాతం కురిసింది. దీంతో రహదారులను మంచు కప్పేసింది. వీధుల్లో నడిచేందుకు ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా ఒక మహిళ పడిన తిప్పలు అందరికీ నవ్వు తెప్పించాయి. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. 

1.02 నిమిషాల నిడివిగల వీడియోక్లిప్‌లో ఓ మహిళ రోడ్డుపై నడుస్తూ జారిపడిపోతుంది. మళ్లీ లేచి, మళ్లీ ప్రయత్నిస్తూ పడిపోయింది. ఇలా చాలాసేపు ప్రయత్నించినా ఆమె మంచుకప్పుకున్న రహదారిపై నడవలేకపోయింది. సీసీ కెమెరాలో రికార్డైన ఈ వీడియోను సోషల్‌మీడియాలో పెట్టారు.  ఈ వీడియోకు చాలా ఫన్నీ కామెంట్స్‌ వచ్చాయి. ‘2020లో మనలో చాలామంది పరిస్థితి ఇదే’ అంటూ ఒకరు చమత్కరించారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo