శనివారం 24 అక్టోబర్ 2020
International - Sep 26, 2020 , 08:34:35

ఉక్రెయిన్‌లో కుప్పకూలిన మిలటరీ విమానం.. 25 మంది దుర్మరణం

ఉక్రెయిన్‌లో కుప్పకూలిన మిలటరీ విమానం.. 25 మంది దుర్మరణం

కీవ్‌ : ఉక్రెయిన్‌లో ఘోర ప్రమాదం జరిగింది. మిలటరీ విమానం కుప్పకూలి 25 మంది దుర్మరణం చెందగా మరో ఇద్దరికి గాయాలయ్యాని ఆ దేశ ప్రాజిక్యూటర్‌ జనరల్‌ ప్రకటనలో తెలిపారు. ఏఎన్‌-26 మిలటరీ విమానం ఇంజిన్‌ విఫలమై ఖార్‌కివ్‌ ప్రాంతం పరిధిలో శుక్రవారం రాత్రి కూలిపోయింది. ప్రాథమిక సమాచారం ప్రకారం దుర్ఘటనలో 25 మంది ప్రాణాలు కోల్పోగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారని ఆ దేశ రక్షణ మంత్రిత్వశాఖ వెల్లడించింది. గాయపడిన ఇద్దరిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మరికొందరి ఆచూకీ కోసం ఘటనాలో స్థలంలో గాలింపు కొనసాగుతున్నది. విమానంలో ఎంతమంది ప్రయాణిస్తున్నది స్పష్టంగా తెలియరాలేదు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo