మంగళవారం 20 అక్టోబర్ 2020
International - Sep 18, 2020 , 19:39:14

బ్రిట‌న్‌లో మ‌ళ్లీ లాక్‌డౌన్‌..!

బ్రిట‌న్‌లో మ‌ళ్లీ లాక్‌డౌన్‌..!

లండ‌న్‌: బ‌్రిట‌న్‌లో కరోనా పాజిటివ్‌ కేసులు భారీ సంఖ్య‌లో న‌మోద‌వుతున్నాయి. దీంతో క‌రోనా కార‌ణంగా అక్క‌డి ఆస్ప‌త్రుల్లో చేరేవారి సంఖ్య ప్ర‌తి 8 రోజులకు రెండింత‌లు అవుతున్న‌ది. ఈ నేప‌థ్యంలో దేశవ్యాప్తంగా మ‌రోమారు లాక్‌డౌన్ తప్పదని బ్రిటన్ ప్రభుత్వం హెచ్చరించింది. వాస్త‌వంగా మ‌రోసారి దేశవ్యాప్త లాక్‌డౌన్‌కు వెళ్లకూడదనే భావిస్తున్నామ‌ని, అవసరమైతే మాత్రం అందుకు సిద్ధంగా ఉన్నామ‌ని బ్రిట‌న్‌ ఆరోగ్య కార్యదర్శి మట్ హ్యాన్‌కాక్ తెలిపారు.

కాగా, యూరప్ దేశాల్లో కరోనా మ‌హ‌మ్మారి బారినపడి అత్యధికంగా ప్రభావితమైన దేశం బ్రిటనే. అక్క‌డ దాదాపు 42 వేల మంది కరోనా మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఇటీవల కొత్త కేసుల న‌మోదు కొంత‌మేర‌కు త‌గ్గినా.. ఇప్పుడు మళ్లీ పెరుగుతున్నాయి. ఈ నేప‌థ్యంలో వైరస్ మరింత చెలరేగకుండా ఉండాలంటే మ‌రోమారు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించడం ఒక్కటే మార్గమని అక్క‌డి వైద్య నిపుణ‌లు చెప్పారు. అక్టోబర్‌లో రెండు వారాలపాటు లాక్‌డౌన్ విధించడం ద్వారా క‌రోనాకు ముకుతాడు వేయవచ్చని అభిప్రాయపడ్డారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo