గురువారం 29 అక్టోబర్ 2020
International - Oct 05, 2020 , 22:27:58

సాయుధ దళాల ఆధ్వర్యంలో కొవిడ్‌ వ్యాక్సిన్‌ పంపిణీ!

సాయుధ దళాల ఆధ్వర్యంలో కొవిడ్‌ వ్యాక్సిన్‌ పంపిణీ!

లండన్: కొవిడ్‌ టీకా అందుబాటులోకి వస్తే దాని పంపిణీ దేశాలముందున్న అతిపెద్ద సవాలు. అయితే, వ్యాక్సిన్‌ పంపిణీకి బ్రిటన్‌ దేశం సాయుధ దళాలను ఉపయోగించుకునేందుకు నిర్ణయించింది. ఈ విషయాన్ని బ్రిటీష్ ఆరోగ్య కార్యదర్శి మాట్ హాంకాక్ వెల్లడించారు. 

‘టీకా పంపిణీలో నేషనల్‌ హెల్త్‌ సర్వీస్‌ (ఎన్‌హెచ్‌ఎస్‌), సాయుధ దళాలు కలిసి పనిచేస్తాయి.’ అని హాంకాక్‌ కన్జర్వేటివ్ పార్టీ వార్షిక వర్చువల్‌ సమావేశంలో తెలిపారు. వ్యాక్సిన్‌ అభివృద్ధి, క్లినికల్‌ ట్రయల్స్‌ మాత్రమే కాదు..దానిని ప్రాధాన్యతావర్గాలకనుగుణంగా పంపిణీ చేయడం కూడా చూసుకోవాల్సి ఉంటుందని అన్నారు. ఎన్‌హెచ్‌ఎస్‌ కొవిడ్‌-19 యాప్‌ను 15 మిలియన్ల మంది డౌన్‌లోడ్‌ చేసుకున్నారని హాంకాక్ ధ్రువీకరించారు. దేశం సురక్షితంగా, సాధ్యమైనంత వేగంగా వ్యాక్సిన్ పొందడానికి తాము చేయగలిగినంత కృషి చేస్తున్నామని తెలిపారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo