ఆదివారం 05 జూలై 2020
International - May 28, 2020 , 00:53:10

చింపాంజీల నుంచే మనిషి భాష

చింపాంజీల నుంచే మనిషి భాష

లండన్‌:  మనిషి కోతుల నుంచి పరిణామం చెందాడనేది డార్విన్‌ సిద్ధాంతం. భూమి మీద క్రమబద్ధమైన శబ్దాలతో మాట్లాడగలిగేది కూడా మానవజాతి మాత్రమే. కానీ, మనిషి మాట కూడా కోతి జాతిలో ఒకటైన చింపాంజీ నుంచే వచ్చిందని తాజాగా పరిశోధకులు తేల్చారు. యూనివర్సిటీ ఆఫ్‌ వార్విక్‌ నేతృత్వంలో ఓ అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం చింపాంజీల పెదాల కదలికలపై అధ్యయనం చేసింది. మనిషి మాట్లాడే భాషతో చింపాంజీల పెదాల కదలికల లయ చాలా దగ్గరగా ఉందని గుర్తించారు. స్కాట్లాండ్‌లోని ఎడిన్‌బరో జూ, జర్మనీలోని లీప్‌జిగ్‌ జూలోని రెండు  చింపాంజీలు, ఉగాండాలోని మరో రెండు చింపాంజీల పెదాల కదలికలకు వీడియో రికార్డు చేసి పరిశోధించారు. 


logo