గురువారం 28 మే 2020
International - May 17, 2020 , 01:07:36

కరోనాను పసిగట్టే శునకాలు!

కరోనాను పసిగట్టే శునకాలు!

లండన్‌: బాంబులను, ప్రమాదకర రసాయనాలను గుర్తించినట్టే.. ఒక వ్యక్తికి కరోనా సోకిందో లేదో గుర్తించే శునకాలు త్వరలో రాబోతున్నాయి. ఈ మేరకు కుక్కలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చే దిశగా బ్రిటన్‌ ప్రభుత్వం పరిశోధనలు చేస్తున్నది. భవిష్యత్తులో రోగ లక్షణాలు కనిపించకముందే వైరస్‌ సోకిన వ్యక్తిని  గుర్తించేలా శునకాలకు శిక్షణ ఇవ్వాలని భావిస్తున్నది. డర్హం యూనివర్సిటీ, లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ హైజీన్‌ అండ్‌ ట్రాపికల్‌ మెడిసిన్‌, చారిటీ మెడికల్‌ డిటెన్షన్‌ డాగ్స్‌  సంస్థలు సంయుక్తంగా ఈ పరిశోధన చేపట్టనున్నాయి. మనుషుల్లో మలేరియా, పార్కిన్సన్స్‌, క్యాన్సర్‌ వంటి వ్యాధులను గుర్తించేలా గతంలో శునకాలకు శిక్షణ ఇచ్చిన నిపుణులు ఇందులో భాగస్వాములు కానున్నారు. ఈ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం 5 లక్షల పౌండ్ల (రూ.4.7 కోట్లు) నిధులు కేటాయించింది. ప్రస్తుతం ట్రయిల్స్‌ ప్రారంభమయ్యాయి. మొదటి దశలో కరోనా రోగుల నుంచి సేకరించిన నమూనాల్లో వైరస్‌ జాడను పసిగట్టే సామర్థ్యం కుక్కలకు ఉన్నదో లేదో గుర్తించనున్నారు. logo