గురువారం 04 జూన్ 2020
International - Apr 17, 2020 , 19:06:43

బ్రిటన్‌లో కరోనా విజృంభణ

బ్రిటన్‌లో కరోనా విజృంభణ

లండన్‌:  బ్రిటన్‌లో కరోనా పాజిటివ్‌ కేసులతో పాటు మరణాల సంఖ్య రోజురోజుకీ భారీగా పెరుగుతున్నది.  24 గంటల వ్యవధిలో 847 మంది కరోనాతో చనిపోయారని బ్రిటన్‌ ఆరోగ్యశాఖ శుక్రవారం తెలిపింది. ఇప్పటి వరకు యూకేలో 108,692 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా..14,576 మంది మరణించారు. మహమ్మారి కట్టడికి ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడంతోనే కరోనా బాధితుల సంఖ్య పెరుగుతోందని వైద్య నిపుణులు ఆరోపిస్తున్నారు.  కరోనా వ్యాప్తి మొదటి దశలో  బ్రిటన్‌లో సుమారు 40వేల మంది మరణించే అవకాశం ఉందని  ప్రముఖ ప్రజారోగ్య నిపుణుడు, ప్రొఫెసర్‌ ఆంటోనీ  హెచ్చరించారు. logo