బుధవారం 03 జూన్ 2020
International - Apr 15, 2020 , 19:58:07

యూకేలో లక్షకు చేరువలో కరోనా కేసులు..!

యూకేలో లక్షకు చేరువలో కరోనా కేసులు..!

లండన్‌: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి  యూరప్‌లోని కొన్ని దేశాల్లో వేగంగా విస్తరిస్తోంది.  బ్రిటన్‌లో ఇవాళ ఒక్కరోజే 4,603 కొత్త కేసులు నమోదు కాగా 761 మంది చనిపోయారు. ఇప్పటి వరకు యూకేలో 98,476 మందికి వైరస్‌ సోకింది. కరోనా బారిన పడి బుధవారం వరకు 12,868 మంది మరణించారు.  

బెల్జియంలోనూ కోవిడ్‌-19 విజృంభిస్తోంది.  24 గంటల వ్యవధిలో ఆదేశంలో  మరో 2,454 కరోనా కేసులు వెలుగులోకి రాగా 283   మరణాలు సంభవించాయి. ఆ దేశంలో కరోనా బాధితుల సంఖ్య 33,573కు పెరిగింది.  ఇప్పటి వరకు 4,440 మంది ప్రాణాలు కోల్పోయారు. 


logo