బుధవారం 23 సెప్టెంబర్ 2020
International - Jul 30, 2020 , 10:20:42

హీరో కంపెనీ సైకిల్ తొక్కిన బ్రిట‌న్ ప్ర‌ధాని

హీరో కంపెనీ సైకిల్ తొక్కిన బ్రిట‌న్ ప్ర‌ధాని

హైద‌రాబాద్‌: బ్రిట‌న్ ప్ర‌ధాని బోరిస్ జాన్సన్.. భార‌త్‌కు చెందిన హీరో కంపెనీ సైకిల్ తొక్కారు.  జీబీపీ 2 బిలియ‌న్ సైక్లింగ్ అండ్ వాకింగ్ డ్రైవ్‌ను ప్ర‌ధాని బోరిస్ ప్రారంభించారు.  కోవిడ్‌19 నేప‌థ్యంలో ఊబ‌కాయానికి వ్య‌తిరేకంగా పోరాటం చేయాల‌న్న ఉద్దేశంతో ఈ డ్రైవ్‌ను ప్ర‌ధాని స్టార్ట్ చేశారు. దీనిలో భాగంగా నాటింగ్‌హామ్‌లోని బీస్ట‌న్ వ‌ద్ద ఉన్న హెరిటేజ్ సెంట‌ర్‌లో బోరిస్ జాన్సన్ సైకిల్ తొక్కారు.  సైకిల్ తొక్క‌డాన్ని ఇష్ట‌ప‌డే జాన్స‌న్‌.. వేల కిలోమీట‌ర్ల బైక్ లేన్ల‌ను ఆవిష్క‌రించాల‌నుకుంటున్న‌ట్లు తెలిపారు. కొత్త ఫిట్‌నెస్ స్ట్రాట‌జీలో భాగంగా ప్ర‌భుత్వం సైకిల్ తొక్కేవారికి ప్ర‌త్యేక లేన్ వేయ‌నున్న‌ది. ఫిట్‌నెస్‌ను పెంచేందుకు, గాలి నాణ్య‌త‌ను పెంచేందుకు, ట్రాఫిక్ జామ్ త‌గ్గించేందుకు ఆ లైన్లు దోహ‌డ‌ప‌డుతాయ‌న్నారు. 

ఆరోగ్య‌, వాతావ‌ర‌ణ స‌మ‌స్య‌ల‌ను అధిగ‌మించేందుకు సైక్లింగ్ చాలా కీల‌క‌మైంద‌ని జాన్స‌న్ తెలిపారు. ప్ర‌ధాని బోరిస్ తొక్కిన సైకిల్ ఇండియాకు చెందిన హీరో మోటార్స్ కంపెనీది.  వికింగ్ ప్రో బైక్ పేరుతో ఆ సైకిల్‌ను మార్కెట్లోకి రిలీజ్ చేశారు. మాంచెస్ట‌ర్‌లో సైకిల్‌ను డిజైన్ చేశారు.   


logo