ఆదివారం 29 నవంబర్ 2020
International - Nov 08, 2020 , 02:40:09

రావణుడ్ని రాముడు ఓడించినట్టే..: బోరిస్‌

రావణుడ్ని రాముడు ఓడించినట్టే..: బోరిస్‌

లండన్‌: కరోనా మహమ్మారిని బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌.. రాక్షస రాజు రావణుడితో పోల్చారు. రావణుడిపై శ్రీరాముడు, సీతాదేవి గెలుపొందినట్లే.. కరోనా మహమ్మారిపై విజయం సాధిద్దామంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. ‘చీకటిపై వెలుగు, చెడుపై మంచి విజయం సాధించినట్లే.. దీపావళి స్ఫూర్తితో కరోనాపై గెలుపొందుదాం. రావణుడిని ఓడించిన తర్వాత అయోధ్యకు వెళ్లే దారిలో సీతారాములు లక్షల దీపాలు వెలిగించారు. మనమూ అదే దారిలో దీపాలను వెలిగించి కరోనాను తుదముట్టిద్దాం. మనముందు భారీ సవాళ్లు ఉన్నాయి. సదాశయంతో ముందుకు వెళితే కరోనా మహమ్మారిపై పైచేయి సాధించొచ్చు’ అని దీపావళి సందేశంలో పేర్కొన్నారు.