బుధవారం 12 ఆగస్టు 2020
International - Jul 04, 2020 , 20:36:09

అమెరికా నుంచి వ‌చ్చేవాళ్లకు మాత్రమే క్వారెంటైన్‌: ‌యూకే

అమెరికా నుంచి వ‌చ్చేవాళ్లకు మాత్రమే క్వారెంటైన్‌: ‌యూకే

న్యూఢిల్లీ: ప‌్ర‌పంచ‌దేశాల నుంచి యూకేకు వచ్చేవారు ఇకపై 14 రోజులపాటు క్వారంటైన్‌లో ఉండాల్సిన అవసరం లేదని అక్క‌డి ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేర‌కు 59 దేశాలపై విధించిన ఆంక్షలను ఎత్తివేయనున్నట్టు తెలిపింది. కొత్త నిబంధనలు జూలై 10 నుంచి అమల్లోకి రానున్నట్టు చెప్పింది. అయితే అమెరికా నుంచి వచ్చేవారు మాత్రం14 రోజులు క్వారెంటైన్‌లో ఉండాల్సిందేన‌ని స్పష్టం చేసింది. 

అమెరికాలో రోజూ 50 వేలకుపైగా కేసులు నమోదవుతున్నకారణంగానే ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలిపింది. అమెరికా నుంచి వచ్చేవారు 14 రోజులపాటు సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉండాల్సిందేనని యూకే ప్రభుత్వం పేర్కొన్న‌ది. కాగా, ఇటీవల యూరోపియన్ యూనియ‌న్‌ సైతం అమెరికా నుంచి వచ్చే వారిని తమ దేశాల్లోకి రానిచ్చేది లేదని నిర్ణ‌యించింది. యూకేలో ఇప్పటివరకు 2,84,276 కరోనా కేసులు నమోదుకాగా 44,131 మంది మృత్యువాతపడ్డారు. 

తాజావార్తలు


logo