శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
International - Jan 17, 2021 , 13:07:09

జీ7కు రండి.. ప్ర‌ధాని మోదీకి బ్రిట‌న్ ఆహ్వానం

జీ7కు రండి.. ప్ర‌ధాని మోదీకి బ్రిట‌న్ ఆహ్వానం

న్యూఢిల్లీ: ఈ ఏడాది జూన్‌లో బ్రిట‌న్‌లోని కార్న్‌వాల్ ప్రాంతంలో జ‌రగ‌బోయే జీ7 స‌ద‌స్సుకు హాజ‌రు కావాల్సిందిగా ప్ర‌ధాని న‌రేంద్ర మోదీని యునైటెడ్ కింగ్‌డ‌మ్ ఆహ్వానించింది. ఇండియానే కాకుండా ఆస్ట్రేలియా, సౌత్ కొరియాల‌ను కూడా ఈ స‌ద‌స్సుకు ప్ర‌త్యేక అతిథులుగా ఆహ్వానించారు. ప్ర‌పంచంలోని 7 ప్ర‌జాస్వామ్య ఆర్థిక వ్య‌వ‌స్థ‌లైన యూకే, జ‌ర్మ‌నీ, కెన‌డా, ఫ్రాన్స్‌, జ‌పాన్‌, ఇట‌లీ, యూఎస్ఏ ఈ జీ7 దేశాలుగా ఉన్నాయి. జీ7 స‌ద‌స్సులో భాగంగా ఈ దేశాలు క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి, ప‌ర్యావ‌ర‌ణంలో వ‌స్తున్న మార్పులు, సాంకేతిక‌ప‌ర‌మైన మార్పులు, శాస్త్రీయ ఆవిష్క‌ర‌ణ‌లు, స్వేచ్ఛా వాణిజ్యంపై చ‌ర్చించ‌నున్నాయి. రిప‌బ్లిక్ డే చీఫ్ గెస్ట్‌గా వ‌స్తాన‌ని చెప్పి ప‌ర్య‌ట‌న ర‌ద్దు చేసుకున్న‌ యూకే పీఎం బోరిస్ జాన్సన్‌.. జీ7 స‌ద‌స్సు ముందు ఇండియాలో ప‌ర్య‌టించే అవ‌కాశం ఉన్న‌ట్లు కూడా యూకే ఒక ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించింది. 

VIDEOS

logo