సోమవారం 01 జూన్ 2020
International - Apr 28, 2020 , 17:23:57

నిమిషం మౌనం పాటించిన బ్రిటన్‌

నిమిషం మౌనం పాటించిన బ్రిటన్‌

లండన్‌: కరోనా వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన బాధితులకు బ్రిటన్‌  నివాళులు అర్పించింది. కరోనా మహమ్మారిపై పోరాటంలో మృతిచెందిన వారి సేవలను  రాజకీయ నాయకులు, దేశప్రజలు  స్మరించుకున్నారు. ప్రధాని బోరిస్‌ జాన్సన్‌తో పాటు దేశపౌరులందరూ నిమిషం పాటు మౌనం వహించారు.  మంగళవారం ఉదయం 11 గంటలకు డాక్టర్లు, నర్సులు తమ విధులను పక్కనపెట్టి ప్రతిఒక్కరూ రెండు మీటర్ల భౌతిక దూరం పాటిస్తూ మౌనం పాటించారు. 

కరోనా నుంచి కోలుకున్న ప్రధాని బోరిస్‌ వరుసగా రెండో రోజు కూడా విధులకు హాజరయ్యారు. కేబినెట్‌ టేబుల్‌ దగ్గర సహచర మంత్రులు, అధికారులతో కలిసి ఆయన నివాళి అర్పించారు. వైరస్‌ వల్ల సుమారు 100 మంది ఎన్‌హెచ్‌ఎస్‌, కేర్‌స్టాఫ్‌ సిబ్బంది మరణించారు. యూకేలో 157,149 మందికి వైరస్‌ సోకింది. ఇప్పటి వరకు 21,092 మంది చనిపోయారు. 


logo