సోమవారం 01 జూన్ 2020
International - Apr 18, 2020 , 19:09:04

బ్రిటన్‌లో 15వేలు దాటిన కరోనా మరణాలు

బ్రిటన్‌లో 15వేలు దాటిన కరోనా మరణాలు

లండన్‌: బ్రిటన్‌లో కరోనా మహమ్మారి  కల్లోలం సృష్టిస్తోంది. తాజాగా అక్కడ 24 గంటల్లోనే 888 మంది ప్రాణాలను బలి తీసుకుంది.  శనివారం సాయంత్రం నాటికి  మొత్తం కేసుల సంఖ్య 15,464కు చేరింది. యూకేలో ఇప్పటి వరకు 357,023 మందికి కోవిడ్‌-19 పరీక్షలు చేయగా 114,217 మందికి పాజిటివ్‌గా తేలిందని బ్రిటన్‌ ఆరోగ్య మంత్రిత్వశాఖ పేర్కొంది.  మరోవైపు లాక్‌డౌన్‌ అమల్లో ఉన్నప్పటికీ అత్యవసర సేవల సిబ్బంది కోసం లండన్‌లో పరిమిత సంఖ్యలో బస్సుల్ని నడిపిస్తున్నారు. 


logo