మంగళవారం 09 మార్చి 2021
International - Jan 20, 2021 , 14:35:53

60 దేశాల్లో యూకే క‌రోనా వేరియంట్‌..

60 దేశాల్లో యూకే క‌రోనా వేరియంట్‌..

జెనీవా: క‌నీసం 60 దేశాల్లో యూకే వేరియంట్ క‌రోనా వైర‌స్ ఆన‌వాళ్లు గుర్తించిన‌ట్లు ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. గ‌త వారం క‌న్నా మ‌రో ప‌ది దేశాల్లో కొత్త వైర‌స్ ఛాయ‌ల‌ను గుర్తించిన‌ట్లు డ‌బ్ల్యూహెచ్‌వో చెప్పింది. ఇప్ప‌టికే క‌రోనా మృతులు 20 ల‌క్ష‌లు దాట‌డంతో.. కొత్త వేరియంట్‌పై ఆందోళ‌న‌లు వ్యక్తం అవుతున్నాయి. యూకే క‌రోనా వేరియంట్ త‌రహాలోనే సౌతాఫ్రికా ర‌కం వైర‌స్ కూడా తీవ్ర ఆందోళ‌న క‌లిగిస్తున్న‌ది.  సౌతాఫ్రికా వేరియంట్ కూడా 23 దేశాల్లో న‌మోదు అయ్యింది.  త‌న వీక్లీ రిపోర్ట్‌లో డ‌బ్ల్యూహెచ్‌వో ఈ విష‌యాన్ని చెప్పింది. గ‌త వారం రోజుల్లో క‌రోనా వ‌ల్ల 93 వేల మంది ప్రాణాలు కోల్పోయిన‌ట్లు ఆరోగ్య సంస్థ వెల్ల‌డించింది. అయితే అదే స‌మ‌యంలో మ‌రో 4.7 కోట్ల మందికి వైర‌స్ సంక్ర‌మించిన‌ట్లు చెప్పింది.  ఆగ‌స్టు చివ‌రి నాటి 70 శాతం జ‌నాభాకు టీకాలు ఇచ్చేందుకు ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు యురోపియ‌న్ యూనియ‌న్ పేర్కొన్న‌ది.  

VIDEOS

logo