గురువారం 28 మే 2020
International - May 06, 2020 , 14:11:05

మరణాల్లో ఇటలీని దాటేసిన బ్రిటన్‌

మరణాల్లో ఇటలీని దాటేసిన బ్రిటన్‌

లండన్‌: బ్రిటన్‌లో కరోనా మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది.  యూరప్‌లో అత్యధిక కరోనా మరణాలు నమోదైన దేశంగా బ్రిటన్‌ నిలిచింది. జాన్స్ హాప్కిన్స్ కరోనా వైరస్ ట్రాకర్ ప్రకారం, బుధవారం మధ్యాహ్నం వరకు కోవిడ్‌-19 కారణంగా ఆ దేశంలో 29,501 మంది చనిపోయారు. ఇటలీలో ఇప్పటి వరకు కరోనా వల్ల 29,315 మంది మరణించారు. ఓఎన్‌ఎస్‌ లెక్కల ప్రకారం బ్రిటన్‌లో మహమ్మారి బారిన పడి మృతిచెందిన వారి సంఖ్య 32 వేలు దాటింది.   

ఇప్పటికే యూరప్‌లోని పలు దేశాల్లో కరోనా తీవ్రత కాస్తతగ్గుముఖం పట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 2,57,337 మంది కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయారు. అగ్రరాజ్య అమెరికాలోనే 71,078 మంది మరణించారు. 


logo