శనివారం 08 ఆగస్టు 2020
International - Aug 02, 2020 , 09:40:59

మ‌హాత్మా గాంధీపై బ్రిట‌న్‌లో నాణెం!

మ‌హాత్మా గాంధీపై బ్రిట‌న్‌లో నాణెం!

లండ‌న్‌: ‌భార‌త జాతిపిత మ‌హాత్మా గాంధీ జ్ఞాప‌కార్థం నాణెం ముద్రించ‌నుంది. ఈ అంశాన్ని ప‌రిశీలించాల‌ని బ్రిట‌న్ ఆర్థిక మంత్రి రిషి సునాక్ రాయ‌ల్ మింట్ అడ్వైజ‌రీ క‌మిటీ (ఆర్ఎంఐసీ)కి సూచించారు. బ్రిట‌న్ అభివృద్ధిలో న‌ల్లజాతి, ఆసియా, ఇత‌ర మైనారిటీ వ‌ర్గాల ప్ర‌జ‌ల స‌హ‌కారాన్ని గుర్తించ‌డానికి ఇది తోడ్ప‌డుతుంద‌ని ఆయ‌న చెప్పారు. 

అమెరికాలో మిన్నియాపొలీస్‌లో న‌ల్ల‌జాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ ఓ పోలీస్ అధికారి చేతిలో చ‌నిపోయాడు. దీంతో ప్ర‌పంచ‌వ్యాప్తంగా జాత్యహంకార దాడుల‌కు వ్య‌తిరేకంగా భారీగా నిర‌సన కార్య‌క్ర‌మాలు జ‌రిగాయి. ఈనేప‌థ్యంలో వ‌ల‌సవాదం, జాత్యహంకారం వంటి అంశాలపై కొన్ని బ్రిటిష్ సంస్థ‌లు దృష్టి సారించాయి. ఆసియా, ‌న‌ల్ల‌జాతి, మైనారిటీ జాతివ‌ర్గాల‌కు స‌హాయం అందించ‌డానికి, జాతి వైవిధ్యానికి తోడ్ప‌డ‌టానికి వారుంటున్న ప్రాంతాల్లో పెట్టుబ‌డులు పెట్ట‌డానికి అనేక సంస్థ‌లు ముందుకువ‌స్తున్నాయి.  ‌    


logo