సోమవారం 03 ఆగస్టు 2020
International - Jul 13, 2020 , 07:01:29

లండన్‌-చైనా దూరభారం

లండన్‌-చైనా దూరభారం

లండన్‌: హాంకాంగ్‌, హువావే వివాదాలతో బ్రిటన్‌, చైనా మధ్య దూరభారం పెరుగుతున్నది. ఐదేండ్ల క్రితం వేలకోట్ల విలువైన వాణిజ్య ఒప్పందంతో బలమైన ఆర్థికబంధాన్ని ఏర్పరుచుకున్న ఈ రెండుదేశాల ద్వైపాక్షిక సంబంధాలు ఇటీవల గతంలో ఎన్నడూ లేనంతగా క్షీణించాయి. హాంకాంగ్‌పై ఆధిపత్యం కోసం చైనా జాతీయభద్రతా చట్టం తేవటం, చైనా ఎలక్ట్రానిక్‌ దిగ్గజం హువావే సంస్థ నుంచి టెలికాం ఉపకరణాలు కొనరాదని బ్రిటన్‌ నిర్ణయించటం ఈ రెండు దేశాల మధ్య సంబంధాలను దిగజార్జాయి. 


చైనాతో సంబంధాలను తెంచుకోవాలని తమకు లేదని, ఇటీవలి కాలంలో చైనా ప్రమాదకర భాగస్వామిగా మారటమే సమస్య అని కన్జర్వేటివ్‌ పార్టీ మాజీ నాయకుడు డంకన్‌ స్మిత్‌ వ్యాఖ్యానించారు.


logo