గురువారం 01 అక్టోబర్ 2020
International - Jul 10, 2020 , 12:01:34

ఆ రెస్టారెంట్ల‌ బంప‌ర్ ఆఫ‌ర్ : క‌డుపు నిండా తిని స‌గం బిల్లు క‌డితే స‌రిపోతుంద‌ట‌!

ఆ రెస్టారెంట్ల‌ బంప‌ర్ ఆఫ‌ర్ : క‌డుపు నిండా తిని స‌గం బిల్లు క‌డితే స‌రిపోతుంద‌ట‌!

క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా అన్ని వ్యాపారాలు ఏమో కాని రెస్టారెంట్ల‌కు మాత్రం గ‌ట్టి దెబ్బే. ఎప్పుడూ క‌స్ట‌మ‌ర్ల‌తో క‌ల‌క‌ల‌లాడే రెస్టారెంట్లు ఇప్పుడు బోసిపోతున్నాయి. లాక్‌డౌన్‌ అంటే ఎలాగూ ఏం న‌డ‌వ‌దు. లాక్‌డౌన్ తొల‌గించిన త‌ర్వాత కూడా ప‌రిస్థితి అలానే ఉంది. క‌రోనా భ‌యంతో ఎవ‌రూ బ‌య‌ట‌కు రావ‌డం లేదు. దీని ఫ‌లితంగా హోట‌ల్ బిజినెస్‌ల‌న్నీ దివాలా తీసేలా ఉన్నాయి. అందుక‌ని ప్ర‌భుత్వం బంప‌ర్ ఆఫ‌ర్ ప్ర‌క‌టించింది. అదేంటంటే.. 'ఎంతైనా తినండి. బిల్లు మాత్రం స‌గం క‌డితే స‌రిపోతుంది. ఈ ఆఫ‌ర్ ఆగ‌స్ట్ వ‌ర‌కు మాత్ర‌మే ఉంటుంది. అది కూడా సోమ‌వారం నుంచి బుధ‌వారం వ‌ర‌కు మాత్ర‌మే వ‌ర్తిస్తుంద‌ని' స్ప‌ష్టం చేశారు.

అబ్బా.. ఇంత మంచి ఆఫ‌ర్ ఉంటే క‌రోనా కూడా గుర్తుకురాదేమో మ‌నోళ్ల‌కు. అందుకేగా మ‌న‌ద‌గ్గ‌ర ఇలాంటి ఆఫ‌ర్లు పెట్ట‌రు. ఇది యూకేలో. ఇటీవ‌ల ప్ర‌వేశ‌పెట్టిన 'మినీ బ‌డ్జెట్'‌లో ఈ విషయంపై‌ బ్రిట‌న్ ఆర్థిక‌శాఖ మంత్రి రిషి సునాక్ ప్ర‌స్తావించారు.  ‘ఈట్ అవుట్ టు హెల్ప్ అవుట్’ డిస్కౌంట్ కింద ప్రజలు ఈ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకోవచ్చని తెలిపారు. అయితే.. ఆహారం, నాన్-ఆల్కహాలిక్ డ్రింకులకు ఈ ఆఫర్ వర్తిస్తుందని పేర్కొన్నారు. మ‌ద్యంపై ఎలాంటి ఆఫ‌ర్ లేదన్నారు. క‌రోనా టైంలో త‌గిన నిబంధ‌న‌లు పాటిస్తూ ఆహారాన్ని ఎంజాయ్ చేయ‌మంటున్నారు. ఈ ఐడియా ఏదో భ‌లే ఉంది క‌దూ. మ‌న ద‌గ్గ‌ర అయితే ఇంకా బాగుంటుంది. logo