సోమవారం 08 మార్చి 2021
International - Jan 18, 2021 , 00:56:04

మళ్లీ అధ్యక్షుడిగా ముసావెనీ

మళ్లీ  అధ్యక్షుడిగా ముసావెనీ

కంపాలా: ఉగాండా అధ్యక్షుడిగా యూవెరీ ముసావెనీ వరుసగా ఆరోసారి ఎన్నికయ్యారు. ఉగాండా ఎలక్టోరల్‌ కమిషన్‌ ఆయన విజయాన్ని ధ్రువీకరించింది. దీంతో మరో ఐదేండ్లు ఆయనే దేశాధ్యక్ష పదవిలో కొనసాగనున్నారు. 76 ఏండ్ల ముసావెనీ 1986లో సైనిక తిరుగుబాటు ద్వారా మొదటిసారి అధ్యక్ష పదవిని చేపట్టారు. అప్పటి నుంచి ఓడిపోలేదు. అయితే ఎన్నికల్లో రిగ్గింగ్‌ జరిగిందని ప్రతిపక్ష నేత బాబీ వైన్‌ ఆరోపించారు. అధ్యక్ష ఎన్నికల్లో ముసావెనీకి 52 శాతం ఓట్లు రాగా, వైన్‌కు 34 శాతం ఓట్లు పడ్డాయి. 

VIDEOS

logo