శుక్రవారం 05 జూన్ 2020
International - Apr 29, 2020 , 00:36:48

యూఎఫ్‌ఓ వీడియోలు విడుదల

యూఎఫ్‌ఓ వీడియోలు విడుదల

అమెరికా రక్షణ కేంద్రం పెంటగాన్‌ సోమవారం అధికారికంగా మూడు యూఎఫ్‌ఓ (అన్‌ఐడెంటిఫైడ్‌ ఫ్లైయింగ్‌ ఆబ్జెక్ట్స్‌) వీడియోలను విడుదల చేసింది. 2004, 2005లో అమెరికా నావికాదళ పైలట్లు ఈ వీడియోలను తీశారు. అయితే 2007, 2017లోనే  ఇవి లీక్‌ అయ్యాయి. ఆ వీడియోల్లో కనిపించిన యూఎఫ్‌ఓలు ఏమిటన్నది ఇంకా గుర్తించలేదని పెంటగాన్‌ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రజల్లో అనుమానాలను తొలిగించేందుకు వీటిని అధికారికంగా విడుదల చేస్తున్నట్లు పేర్కొంది. ఏలియన్ల ఉనికికి ఇవే నిదర్శనమని పలువురు నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు. 


logo