శుక్రవారం 27 నవంబర్ 2020
International - Nov 03, 2020 , 18:36:32

చైనీస్‌ కొవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకున్న సౌదీ అరేబియా ప్రధాని

చైనీస్‌ కొవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకున్న సౌదీ అరేబియా ప్రధాని

దుబాయ్‌ : సౌదీ అరేబియా ప్రధానమంత్రి, దుబాయ్‌ పాలకుడు షేక్‌ మొహమ్మద్‌ బిన్‌ రషీద్‌ అల్‌ మక్తూమ్‌ మంగళవారం కరోనా వైరస్‌ వ్యాక్సిన్‌ మోతాదును అందుకున్నారు. ఈ విషయాన్ని ట్విట్టర్‌ ద్వారా ఆయన ఫొటోతో పాటు వార్తను షేర్‌ చేశారు. ఈ వ్యాక్సిన్‌ చైనా నుంచి దిగుమతి అయినట్లుగా తెలుస్తున్నది. "ఈ రోజు కొవిడ్-19 వ్యాక్సిన్‌ను స్వీకరిస్తున్నప్పుడు.. ప్రతి ఒక్కరి భద్రతను, మంచి ఆరోగ్యాన్ని కోరుకున్నా. యూఏఈలో వ్యాక్సిన్ అందుబాటులో ఉంచడానికి అవిశ్రాంతంగా కృషి చేసిన మా బృందాల పట్ల గర్విస్తున్నాం. యూఏఈలో భవిష్యత్‌ ఎల్లప్పుడూ మెరుగ్గా ఉంటుందని ఆశిస్తున్నాను" అని తన పోస్ట్‌లో రాశారు.

అల్ జజీరా నివేదికల ప్రకారం.. చైనా స్టేట్ ఫార్మాస్యూటికల్ దిగ్గజం సినోఫార్మ్ అభివృద్ధి చేసిన కొవిడ్-19 వ్యాక్సిన్‌ను సౌదీ అరేబియా ప్రధానమంత్రి షేక్ మొహమ్మద్ బిన్‌ రషీద్‌ అల్‌ మక్తూమ్‌ అందుకున్నారు. ఇటీవలి రోజుల్లో కరోనా వైరస్‌కు టీకాలు వేసుకున్న ఉన్నతాధికారుల వరుసలో షేక్‌ మొహమ్మద్‌ తాజావారు. విదేశాంగ మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ అల్ నహ్యాన్, ఉపప్రధాని షేక్ సైఫ్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ కూడా ప్రయోగాత్మక వ్యాక్సిన్ తీసుకున్నారు. సినోఫార్మ్ వ్యాక్సిన్ యొక్క మూడవ దశ ట్రయల్స్‌లో క్రౌన్ ప్రిన్స్ సల్మాన్ పాల్గొన్నట్లు సెప్టెంబర్‌లో బహ్రెయిన్ ప్రకటించింది. 

గత నెలలో కొవిడ్-19 రోగులతో సన్నిహితంగా ఉన్న ఆరోగ్య కార్యకర్తలను రక్షించడానికి, వారి భద్రతను నిర్ధారించడానికి దేశంలోని చర్యలలో భాగంగా సినోఫార్మ్ కొవిడ్-19 వ్యాక్సిన్‌ను అత్యవసరంగా వాడటానికి యూఏఈ ప్రభుత్వం అధికారం ఇచ్చింది. సినోఫార్మ్ యొక్క చైనా నేషనల్ బయోటెక్ గ్రూప్, అబుదాబికి చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ కంప్యూటింగ్ కంపెనీ గ్రూప్ 42ల భాగస్వామ్యంతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఈజిప్ట్, బహ్రెయిన్, జోర్డాన్లలో మూడవ దశ ట్రయల్స్ ముగిసే దశకు చేరుకున్నది.

రష్యాకు చెందిన స్పుత్నిక్ V క్లినికల్ ట్రయల్స్‌ను యూఏఈ ఆమోదించినట్లు గత నెలలో అధికారులు ప్రకటించారు. ఇలా ఆమోదించిన మొదటి మధ్య ప్రాచ్య దేశంగా సౌదీ అరేబియా అవతరించినట్లు పేర్కొన్నారు. కాగా, ఫ్రంట్‌లైన్ కార్మికులపై చైనా కొవిడ్-19 వ్యాక్సిన్‌ను ఉపయోగించటానికి మంగళవారం బహ్రెయిన్ ప్రభుత్వం అత్యవసర అనుమతినిచ్చింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.