బుధవారం 05 ఆగస్టు 2020
International - Aug 01, 2020 , 21:21:55

న్యూక్లియర్ పవర్‌ప్లాంట్‌ను ప్రారంభించిన యూఏఈ..అరబ్‌ దేశాల్లోనే మొదటిది

న్యూక్లియర్ పవర్‌ప్లాంట్‌ను ప్రారంభించిన యూఏఈ..అరబ్‌ దేశాల్లోనే మొదటిది

దుబాయ్‌: యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ తమ దేశంలో న్యూక్లియర్‌ పవర్‌ ప్లాంట్‌ను విజయవంతంగా ప్రారంభించింది. బరాకా అణు విద్యుత్‌ కేంద్రంగా నామకరణం చేసింది. ఇది అరబ్‌ దేశాల్లోనే మొట్టమొదటి వాణిజ్య అణువిద్యుత్‌ కేంద్రం. ఈ మేరకు యూఏఈ ప్రధాని మహ్మద్‌ బిన్‌ రశీద్‌ శనివారం వివరాలు వెల్లడించారు.  

‘అబుదాబిలో బరాకా స్టేషన్‌ వద్ద అరబ్‌ ప్రపంచంలోనే మొట్టమొదటి శాంతియుత అణు రియాక్టర్‌ను ప్రారంభించాం. యూఏఈ సాధించిన ఈ విజయాన్ని అధికారికంగా ప్రకటిస్తున్నాం.’ అని రశీద్‌ ట్వీట్‌ చేశారు.  నిపుణులు అణు ఇంధనాన్ని లోడ్‌ చేశారని, సమగ్ర పరీక్షలు నిర్వహించారని, విజయవంతంగా ప్రారంభించారని వివరించారు.  

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo