శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
International - Sep 15, 2020 , 21:01:44

చైనా వ్యాక్సిన్‌ వాడేందుకు దుబాయ్‌ అత్యవసర అనుమతులు

చైనా వ్యాక్సిన్‌ వాడేందుకు దుబాయ్‌ అత్యవసర అనుమతులు

దుబాయ్: యూఏఈలో కరోనా వ్యాక్సిన్‌ హ్యుమన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ ప్రారంభమైన ఆరు వారాల తర్వాత దానిని వాడేందుకు గల్ఫ్‌ దేశం అత్యవసర అనుమతులు ఇచ్చింది. ఈ వ్యాక్సిన్‌ను చైనా ప్రభుత్వ యాజమాన్యంలోని ఔషధ సంస్థ సినోఫామ్ అభివృద్ధి చేసింది. ఈ టీకా మూడో దశ ట్రయల్స్‌ యూఏఈలో జూలైలో ప్రారంభమయ్యాయి. ఇంకా క్లినికల్‌ ట్రయల్స్‌ నడుస్తున్నాయి.   

కరోనా వైరస్‌ బారిన పడే ప్రమాదం ఎక్కువున్న తమ దేశ సైనికులకు ఈ టీకా మొదట అందుబాటులో ఉంటుంది అని యూఏఈ నేషనల్ ఎమర్జెన్సీ క్రైసిస్ అండ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్‌ అథారిటీ ట్వీట్‌ చేసింది. ఆ దేశంలో కొవిడ్‌ -19 కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఈ ప్రకటన వచ్చింది. కొవిడ్‌ వ్యాప్తి ప్రారంభమైననాటినుంచి తొలిసారిగా గత శనివారం 1,007 కేసులు (అత్యధికం) నమోదయ్యాయి. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo