మంగళవారం 11 ఆగస్టు 2020
International - Jul 06, 2020 , 07:45:43

దక్షిణ చైనా సముద్రంలోకి యూఎస్‌ న్యూక్లియర్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ క్యారియర్లు

దక్షిణ చైనా సముద్రంలోకి యూఎస్‌ న్యూక్లియర్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ క్యారియర్లు

వాషింగ్టన్‌: అమెరికా తన న్యూక్లియర్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ క్యారియర్లు యూఎస్‌ఎస్‌ నిమిజ్‌, యూఎస్‌ఎస్‌ రొనాల్డ్‌ రీగన్‌లను దక్షిణ చైనా సముద్రంలోకి విన్యాసాల నిమిత్తం పంపిస్తున్నది. తద్వారా ఈ సముద్రంలో దూకుడుగా వ్యవహరిస్తున్న చైనాకు హెచ్చరికలు పంపనుంది. భారత్‌తో చైనా కయ్యానికి కాలుదువుతున్న ప్రస్తుత తరుణంలో అమెరికా చర్య ప్రాధాన్యాన్ని సంతరించుకున్నది. 

ఈ ఎయిర్‌క్రాఫ్ట్‌ క్యారియర్లు లుజోణ్‌ జలసంధిని చేరినట్లు సమాచారం. ఈ నెల 1 నుంచి చైనా నౌకాదళం దక్షిణ చైనా సముద్రంలో మిలటరీ విన్యాసాలు నిర్వహిస్తున్నది.


logo