బుధవారం 03 జూన్ 2020
International - Apr 13, 2020 , 19:29:54

అమెరికా యుద్ధ‌నౌక‌లోని నావికుడు క‌రోనాతో మృతి

అమెరికా యుద్ధ‌నౌక‌లోని నావికుడు క‌రోనాతో మృతి

హైద‌రాబాద్: అమెరికా యుద్ధ నౌక థియోడ‌ర్ రూజ్‌వెల్ట్‌లో ప‌నిచేస్తున్న నేవీ ఉద్యోగి ఒక‌రు క‌రోనా వైర‌స్‌తో మృతిచెందాడు.  గువామ్‌లోని ఇంటెన్సివ్ కేర్‌లో అత‌ను నాలుగు రోజుల పాటు చికిత్స పొందాడు. అయితే ఇవాళ అత‌ను తుదిశ్వాస విడిచిన‌ట్లు అధికారులు చెప్పారు.  యుద్ద‌నౌక థియోడ‌ర్‌లో సుమారు 4 వేల మంది సిబ్బంది ఉన్నారు. అయితే నౌక‌లో ఉన్న వంద మందికి క‌రోనా సోకిన‌ట్లు దాని కెప్టెన్ అమెరికా ప్ర‌భుత్వాన్ని హెచ్చ‌రించిన విష‌యం తెలిసిందే. త‌మ నౌక‌కు డాకింగ్ ఏర్పాటు చేయాల‌ని ఆయ‌న త‌న లేఖ‌లో కోరాడు.  కెప్టెన్ త‌న లేఖ‌ను మీడియాకు రిలీజ్ చేసిన కార‌ణంగా.. అత‌న్ని పెంటగాన్ స‌స్పెండ్ చేసింది.  ఆ త‌ర్వాత క్ష‌మాప‌ణ‌లు కూడా చెప్పింది. యుద్ధంలేని స‌మ‌యంలో యుద్ధ వీరులు చ‌నిపోకుండా చూసుకోవాల‌ని, వెంటనే నావికుల్ని ర‌క్షించాల‌ని థియోడ‌ర్ కెప్టెన్ అమెరికా ప్ర‌భుత్వాన్నిత‌న లేఖ‌లో కోరారు. logo