గురువారం 01 అక్టోబర్ 2020
International - Jul 22, 2020 , 14:51:16

చైనా రాయబార కార్యాలయం మూసివేయండి: అమెరికా

చైనా రాయబార కార్యాలయం మూసివేయండి: అమెరికా

వాషింగ్టన్: హౌస్టన్‌లోని చైనా రాయబార కార్యాలయాన్ని మూసివేయాలని అమెరికా ఆదేశించింది. దీని కోసం 72 గంటలు గడువు ఇచ్చినట్లు చైనా కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన అధికార గ్లోబల్ టైమ్స్ పత్రిక ఎడిటర్ హు జిజిన్ బుధవారం ట్వీట్ చేశారు. మరోవైపు హౌస్టన్‌లోని చైనా రాయబార కార్యాలయం ప్రాంగణం వద్ద భారీగా పేపర్లు, ఫైళ్లను తగులబెట్టడంతో మంటలు, పొగ కనిపించినట్లు స్థానిక మీడియా సంస్థలు పేర్కొన్నాయి.   దీంతో అగ్నిమాపక యంత్రాలు అక్కడికి చేరుకున్నాయని, అయితే చైనా రాయబార అధికారులు వాటిని లోనికి అనుమతించలేదని తెలిపాయి. అనంతరం కొంతసేపటికి మంటలను ఆర్పివేసినట్లు స్థానిక టీవీ చానళ్లు వెల్లడించాయి. హౌస్టన్‌లోని రాయబార కార్యాలయాన్ని శుక్రవారం సాయంత్రానికి చైనా అధికారులు ఖాళీ చేయనున్నట్లు అధికార వర్గాల ద్వారా తెలిసిందని స్థానిక మీడియా పేర్కొంది.
 


logo