బుధవారం 03 జూన్ 2020
International - Apr 03, 2020 , 14:50:13

అమెరికాలో 6వేలు దాటిన మరణాలు

అమెరికాలో 6వేలు దాటిన మరణాలు

న్యూయార్క్‌:  అగ్రరాజ్యం అమెరికా కోవిడ్‌-19 ధాటికి వణికిపోతోంది. కరోనా వైరస్‌ కారణంగా 33 కోట్ల  మంది జనాభా ఉన్న అమెరికాలో గత నెల రోజులుగా సుమారు 27 కోట్ల మంది ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు.  వైరస్‌ సోకిన వారికి చికిత్స అందించేందుకు అవసరమైన  అత్యవసర ఔషధాలు, వైద్య సామగ్రికి కొరత ఏర్పడింది.  కరోనా కారణంగా ఇప్పటి వరకు మృతిచెందిన వారి సంఖ్య 6వేలు దాటింది. ఇవాళ్టి వరకు 2,42,182 కోవిడ్‌-19 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 9,228 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు.   ప్రపంచంలోనే అత్యధిక కరోనా కేసులు అమెరికాలోనే నమోదయ్యాయి. దీంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఏప్రిల్‌ 30 వరకు సామాజిక దూరం పాటించాలంటూ మార్గదర్శకాలు జారీ చేశారు.


logo