శనివారం 26 సెప్టెంబర్ 2020
International - Sep 05, 2020 , 19:56:21

జపాన్ లో టైఫూన్ : సన్నద్ధమైన ప్రభుత్వం

జపాన్ లో టైఫూన్ : సన్నద్ధమైన ప్రభుత్వం

టోక్యో : రానున్న కొద్ది రోజుల్లో నైరుతి జపాన్‌ను టైఫూన్ హైషెన్ తాకే అవకాశం ఉన్నది. 22,000 మంది సైనికులను పూర్తి అప్రమత్తం చేయడానికి దేశ సైన్యాన్ని ప్రేరేపించినట్లు జపాన్ రక్షణ మంత్రి టారో కోనో శనివారం చెప్పారు. “ఏదైనా అనుకోని సంఘటన జరిగితే సహాయ పడేందుకు ఆత్మరక్షణ దళాలు 22 వేల మంది అప్రమత్తంగా ఉన్నారు. ఆత్మరక్షణ దళాలు మరింత శక్తిని సమకూర్చుకోవాలి. అలాగే దేనికైనా సిద్ధంగా ఉండాలి” అని చెప్పినట్లు కోనో తెలిపారు.

అంతకుముందు రోజు, ఈ తుఫాను సునామీలతో పోల్చదగిన అధిక తరంగాలకు కారణమవుతుందని జపాన్ వాతావరణ సంస్థ తెలిపింది. హైషెన్ కేంద్రంలో వాతావరణ పీడనం 920 హెక్టోపాస్కల్స్, దాని పవన శక్తి గంటకు 180 కిలోమీటర్లు, గస్ట్స్ గంటకు 252 కిలోమీటర్ల వరకు ఉంటాయి. హైషెన్ సెప్టెంబర్ 6, 7 తేదీలలో జపాన్ యొక్క క్యుషు ద్వీపాన్ని తాకే అవకాశం ఉన్నది. తుఫాను సమీపిస్తున్నందున దక్షిణ మరియు నైరుతి జపాన్‌లో దాదాపు 100 విమానాలు శనివారం రద్దయ్యాయి.


logo