మంగళవారం 26 మే 2020
International - Apr 21, 2020 , 14:52:03

ఇంటిపైకప్పుల నుంచి టెన్నిస్‌ ఆడిన అమ్మాయిలు: వీడియో

ఇంటిపైకప్పుల నుంచి టెన్నిస్‌ ఆడిన అమ్మాయిలు: వీడియో

రోమ్‌:  కంటికి కనిపించని వైరస్‌ ఎటు నుంచి వస్తుందో.. ఎవరిపై దాడి చేస్తుందో.. ఎవరికీ తెలియదు.  అందుకే మందులేని ఈ మహమ్మారిని నిరోధించాలంటే.. వైద్యులు చెబుతున్నట్లు ‘సామాజిక దూరమే’ మనకున్న ఏకైక ఆయుధం. అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్లినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడంతోపాటు మనిషికీ మనిషికి నడుమ ‘మీటర్‌ దూరం’ ఉంటేనే వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్టపడుతుంది.   

ఇటలీలో కరోనా విజృంభిస్తుండటంతో లాక్‌డౌన్‌ విధించారు. దీంతో దేశప్రజలందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. సాధారణంగా టెన్నిస్‌ ఆటను ఆయా కోర్టుల్లోనే ఆడతారు కానీ, ఇటలీలో ఓ ఇద్దరు యువతులు తమ ఇళ్ల పైకప్పుల నుంచి టెన్నిస్‌ ఆడటం వైరల్‌గా మారింది. వీరిద్దరూ ఎలాంటి తప్పిదాలు లేకుండా సుధీర్ఘ ర్యాలీలు ఆడటం విశేషం.  ఇప్పటి వరకు ఇటలీలో 1,81,228 మందికి వైరస్‌  సోకింది.


logo