బుధవారం 03 జూన్ 2020
International - Apr 29, 2020 , 15:38:39

అధ్య‌క్ష ఎన్నికలు క‌ష్ట‌మే

అధ్య‌క్ష ఎన్నికలు క‌ష్ట‌మే

అగ్ర‌రాజ్యం అమెరికాలో ఈ ఏడాది న‌వంబ‌ర్ 3న అధ్య‌‌క్ష ఎన్నిక‌లు జ‌రుగాల్సి ఉంది. ప్ర‌స్తుత అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ మ‌రోసారి అధ్య‌క్ష ప‌దవికోసం పోటీ ప‌డుతున్నారు. అయితే అనుకోని విధంగా వ‌చ్చిప‌డిన క‌రోనా విప‌త్తుతో ఇప్పుడు అమెరికా విల‌విల‌లాడుతున్న‌ది. దేశంలో క‌రోనా కేసుల సంఖ్య ప‌ది ల‌క్ష‌లు దాటింది. మృతుల సంఖ్య 60 వేల‌కు చేరువ అవుతున్న‌ది. ఈ అంటువ్యాధి ఇప్ప‌ట్లో అదుపులోకి వ‌చ్చే సూచ‌న‌లు కూడా క‌నిపించ‌టంలేదు. దాంతో నవంబ‌ర్‌లో అధ్య‌క్ష ఎన్నిక‌లు జ‌రిగే అవ‌కాశాలు త‌క్కువేన‌ని ఓ స‌ర్వేలో ఎక్కువ‌మంది అమెరిక‌న్లు అభిప్రాయ‌ప‌డ్డారు. కోవిడ్‌-19 వైర‌స్ అధ్య‌క్ష ఎన్నిక‌ల‌కు ఇబ్బందిగా మార‌వ‌చ్చ‌ని తెలిపారు. 

ఈ నెల 7 నుంచి 12 తేదీ వ‌ర‌కు ప్యూ రిసెర్చ్ సంస్థ 4,917 మంది అమెరిన్ల‌ను ఈ అంశంపై ప‌లు ప్ర‌శ్న‌లు అడిగింది.  క‌రోనా వ‌ల్ల ప్ర‌జ‌లు అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో ఓటు వేయ‌లేక‌పోవ‌చ్చ‌ని స‌ర్వేలో పాల్గొన్న‌వారిలో 67శాతం మంది అభిప్రాయ‌ప‌డ్డారు. ఎప్పుడైనా అధ్య‌క్ష ఎన్నిక‌లు అత్యంత నిష్పాక్షికంగా జ‌రుగుతాయ‌ని ఎక్కువ‌మంది అమెరిక‌న్లు న‌మ్ముతుంటారు. అయితే ఈసారి మాత్రం 46శాతం మంది డెమోక్రాట్లు ఎన్నిక‌లు నిష్పాక్షికంగా జ‌రుగుతాయ‌ని న‌మ్మ‌కంలేద‌ని తెలిపారు. ఈమెయిల్ ద్వారా ఓటు వేయ‌టానికి సిద్ధ‌మేనా అన్న ప్ర‌శ్న‌కు 70శాతం మంది సుముఖ‌త వ్య‌క్తంచేశారు. అన్ని ఎన్నిక‌ల్లో ఈమెయిల్ ద్వారా ఓటువేసే విధానానికి 52శాతం మంది మ‌ద్ద‌తు తెలిపారు. 


logo