గురువారం 28 మే 2020
International - Apr 09, 2020 , 13:33:44

ధైర్యం, దైవభక్తి నన్ను బతికించాయి: 104 ఏళ్ల బామ్మ సందేశం

ధైర్యం, దైవభక్తి నన్ను బతికించాయి: 104 ఏళ్ల బామ్మ సందేశం

హైదరాబాద్: కరోనా వృద్ధులను వదిలిపెట్టదు అంటారు. 70-80 ఏళ్లవాళ్లు ఈ వ్యాధి బారిన పడితే నీళ్లు వదలాల్సిందేనని చెప్పుకుంటారు. కానీ కరోనా విళయతాండవం చేస్తున్న ఇటలీలలో ఓ 104 సంవత్సరాల బామ్మ వైరస్ తో పోరాడి విజయం సాధించింది. ఈ ముత్తవ్వ పేరు అదా జానుసీ. ఈమెకు ఉత్తర ఇటలీలోని మారియా గ్రాజియా ఆస్పత్రిలో చికిత్స జరిగింది. ప్రస్తుతం ఈమె కరోనా కబంధ హస్తాల నుంచి బయటపడి సాధారణ జీవితం గడుపుతున్నది. నేను క్షేమమే అని బయటి ప్రపంచానికి మీడియా ద్వారా ఈమె సందేశం కూడా ఇచ్చింది. ప్రస్తుతం పేపరు చదువుతూ, టీవీ చూస్తూ కాలక్షేపం చేస్తున్నానని వెల్లడించింది. ఇంతకూ ఇదెలా సాధ్యమైందని అడిగితే రెండు ముక్కల్లో ధైర్యం, దైవభక్తి అని సమాధానమిచ్చింది. ఈ 104 ఏళ్లల్లో ఏ లక్షణాలైతే నన్ను నిలబెట్టాయో అవే ఇప్పుడూ కాపాడాయి అంటున్నది. అందరూ ఈ మార్గాన్నే అవలంబిస్తే వైరస్‌ను తరమవచ్చని చెప్పింది.


logo